ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య
== అటవీ రేంజర్ పై గుత్తి కోయల దాడి
== ప్లాంటేషన్ నరికివేస్తున్న గుత్తికోయలను ఆపేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
== వేటకొడవళ్లతో దాడి.. పరిస్థితి విషమం
== ఖమ్మంప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
== విషాదంలో ఫారెస్ట్ శాఖ
== మృతిదేహాన్ని పరిశీలించిన ఫారెస్ట్ సీసీఎఫ్, డీఎఫ్ఓ
== నేడు ఎఫ్ఆర్ఓ స్వగ్రామం ఈర్లపూడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
== ఎఫ్ఆర్ఓ హత్యపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు
== ఎఫ్ఆర్ఓ కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా,ఉద్యోగం, పెన్షన్ ప్రకటించిన సీఎం
== నింధితులను కఠినంగా శిక్షిస్తామని హామి
== కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్
(భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు(47) ను గుత్తికోయలు దారుణంగా హత్యచేశారు. ఫ్లాంటేషన్ చేసిన మొక్కలను నరుకుతున్నారనే సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆపేందుకు ప్రయత్నం చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావుపై గుత్తికోయలు విచక్షణ రహితంగా వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఫారెస్ట్ శాఖలో విషాదం నెలకొంది.. అనేక సార్లు బెస్ట్ ఆఫీసర్ గా అవార్డులు అందుకున్న శ్రీనివాస్ రావు హత్యకు గురికావడంతో కుటుంబంలో రోధనలు మిన్నంటాయి.. ఈ హత్య పట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
allso read- గుత్తి కోయల దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి
రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా, ఉద్యోగం, ఫింన్షన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యావత్తు ఉధ్యోగ సంఘాలు ఎఫ్ఆర్ఓ హత్య పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా బుధవారం ఎఫ్ఆర్ఓ స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు గ్రామ శివారులో ఎర్రబోడు అటవీ ప్రాంతంలో గుత్తికోయలు ఫ్లాంటెషన్ మొక్కలను నరుకుతున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్పటికే విధుల్లో ఉన్న ఫారెస్ట్ రేంజర్ చెలమాల శ్రీనివాస్ రావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు మోటర్ సైకిల్ ద్వారా సంఘటన స్థలానికి చేరుకుని గుత్తికోయలను నిలవరించే ప్రయత్నం చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. అప్పటికే పక్కా ప్లాన్ తో ఉన్న గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ పై దాడికి పాల్పడ్డారు. వేటకోడవళ్లతో మేడపై, చాతిపై దాడి చేయడం ప్రారంభించడంతో సెక్షన్ ఆఫసర్ రామరావు అక్కడ నుంచి పరారై, పారెస్ట్ ఆఫీసర్లకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ రేంజర్ చెలమాల శ్రీనివాస్ రావు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిఉన్నాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ ను 2కిలోమీటర్ల పాటు మోసుకుంటూ చండ్రుగొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఎఫ్ఆర్ఓ పరిస్థితి విషమంగా ఉండటంతోఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకరాగా, చికిత్సపొందుతూనే శ్రీనివాస్ రావు మృతిచెందారు. దీంతో ఫారెస్ట్ శాఖలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి..
== సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ
చండ్రుగొండ ఆసుపత్రిలో ఉన్న రేంజర్ ను కొత్తగూడెం డిఎస్పి వెంకటేశ్వరా బాబు,సీఐ వసంత్ కుమార్, ఎస్సైలు గణేష్, విజయలక్ష్మి, విజయ సందర్శించి వెంటనే అక్కడినుండి సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఆసుపత్రికి చేరుకుని అక్కడ శ్రీనివాస్ రావును చూశారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ గుత్తి కోయలు మొత్తంగా ఊరి కాళీ చేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి ఉదృతంగా మారడంతో గుత్తి కోయిల గ్రామంలో ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు. అనతి కాలంలోనే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసరావు పై దాడి చేయడం పట్ల మండలంలోని ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు తీవ్రంగా ఖండించారు.
allso read- తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?
== ఖమ్మం ఆసుపత్రిలో కుటుంబాన్ని ఓదార్చిన సీసీఎఫ్,డీఎఫ్ఓ
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావును హత్య చేశారని తెలుసుకున్న వరంగల్ రేంజ్ సీసీఎఫ్ బీమానాయక్, డీఎఫ్ఓ సిదార్థ విక్రమ్ సింగ్ ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చనిపోయి ఉన్న రేంజర్ శ్రీనివాస్ రావును పరిశీలించారు. విషాదంలో రోధనలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ బీమా నాయక్ విలేకర్లతో మాట్లాడుతూ శ్రీనివాస్ చాలా మంచి ఆఫీసర్ అని, ఆయన అనేక సార్లు అవార్డులు అందుకున్నారని, హత్య జరగడం విషాదకరమన్నారు. ఇలాంటి సంఘటన జరగడం ఫారెస్ట్ శాఖలో విషాదం నింపిందన్నారు. నింధిత గుత్తికోయలపై కఠినచర్యలుతీసుకుంటామని అన్నారు. ఫారెస్ట్ అధికారులపై అనేకసార్లు దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించే విషయంలో ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని అన్నారు. ఫారెస్ట్ ను రక్షించేందుకు మా సిబ్బంది, అధికారులు ప్రయత్నం చేస్తారని, ఏ ఒక్కరి స్వార్థం కోసం పనిచేయరని, ఫారెస్ట్ వల్ల పర్యవరణం బాగుంటుందని, పర్యావరణం బాగుంటేనే ప్రజలు భాగుంటారని, ఇది అందరి కోసం చేసే ఉద్యోగమైనప్పటికి మాపై దాడులు చేస్తుండటం బాధాకరమన్నారు.
== సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి సంఘటన చాలా బాధాకరమన్నారు. ఫారెస్టును రక్షిస్తున్నవారిపై దాడులు చేయడం అమానుషమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామినిచ్చారు. ఈ మేరకు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఓ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, సర్వీస్ ఉన్నంత వరకు కుటుంబానికి వేతనం అందించాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ఆయన చనిపోలేదని, ఆయన మనలోనే ఉన్నారని, అందుకే శ్రీనివాస్ పూర్తి సర్వీస్ ఉన్నంత వరకు జీతభత్యాలను అందించాలని ఆదేశించారు. కారుణ్య నియామకం కిందా కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వం ఉధ్యోగం ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో శ్రీనివాస్ అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబానికి ఇంటిస్థలం అందించాలని సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశించారు.
== జిల్లాలో ఎన్నో ఏళ్లుగా రగులుతున్న పంచాయతీ
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఫారెస్టు అధికారులకు, వలస గుత్తికోయలకు మధ్య ఎన్నో ఏళ్లుగా పగ రగులుతోంది. చత్తీస్ గడ్ నుంచి గడిచిన 25ఏళ్ల నుంచి వందలాధి మంది వలసవాదులు(గుత్తికోయలు) అశ్వరరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ సమీప అటవిప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం సుమారు 40 కుటుంబాలు చండ్రగొండ మండలం బెండాలపాడు ప్రాంత అటవిలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అక్కడ పోడు భూములు సాగు చేస్తూ జీవిస్తున్నారు. అటవిలో గుడిసెలు వేసుకుని ఏళ్ల పాటు నివాసం ఉంటున్నారు. వారికి కరెంట్ సౌకర్యం లేదు. ఆధార్ సౌకర్యంలేదు.. అడవిలో మగ్గుతున్నారు.అయినప్పటికి అడవిని వదలడం లేదు. మూడేళ్ల క్రితం బావి తవ్వుకున్నట్లు సమాచారం. దీంతో సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ సందర్శించి ఆ భావిని పూడ్చేశారు. మళ్లీ మరో బావిని తీయగా, ఆ బావి ఎక్కడ ఉందో బయటపడలేదని తెలుస్తోంది. అనంతరం వలసగుత్తికోయలు సుమారు 100 ఎకరాల్లో ఫారెస్ట్ ను నరికివేస్తూ వ్యవసాయం సాగు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, సిబ్బంది ఆ భూమిని స్వాధినం చేసుకుని హరితహారం మొక్కలను నాటారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేస్తుండటంతో ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను నరికేసేందుకు గుత్తికోయలు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఎఫ్ఆర్ఓపై గుత్తికోయలు పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం సమయం చూసి దాడి చేసి హత్య చేసినట్లుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
allso read- సీఎం కేసీఆర్ పై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
== మంచి ఆఫీసర్ గా గుర్తింపు
చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ చాల మంచి ఆఫీసర్ గా ఆ శాఖలో మంచి గుర్తింపు ఉంది. కమ్మం జిల్లా రఘునాథపాలం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన చెలమెలా శ్రీనివాస్ రావు కు భార్య, కుమార్తే, కుమారుడు ఉన్నారు. 24ఏళ్ల వయస్సులోనే అటవీశాఖలో ఉద్యోగం సంపాధించారు. సెక్షన్ అధికారిగా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న శ్రీనివాస్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పనిచేశారు. ఎంతో మంచి గుర్తింపు పొందారు. అనేక అవార్డులను పొందారు. ఈ క్రమంలో 2017 సంవత్సరంలో ఎఫ్ఆర్ఓగా ఉద్యోగోన్నతి పొందారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సాగు విస్తీర్ణం పెరగకుండా చొరవ తీసుకున్నారు. 2019 లో చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ బాధ్యతలు తీసుకున్న ఆయన వందల ఎకరాల్లో మొక్కలు నాటారు. 2020లో ఉత్తమ అధికారిగా బంగారు పతకం అందుకున్న ఆయన ఫారెస్ట్ సేవ్ కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేవ్ ఫారెస్ట్ అంటూ ఒక పాటను కూడా రాయడం గమనర్హం.
== స్వగ్రామంలో అంత్యక్రీయలు
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం శ్రీనివాస్ రావు స్వగ్రామం. ఆయన అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఈర్లపూడి గ్రామానికి తరలించారు.
== అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు
ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతుండగా, ఈ అంత్యక్రియలకు రాష్ట్ర అటవిశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ, ఫారెస్ట్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుని అక్కడ నుంచి కారులో ఈర్లపూడి చేరుకుని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేపట్టనున్నారు. శ్రీనివాస్ అంత్యక్రియలకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో హాజరుకానున్నారు.