సెల్ టవర్ ఎక్కిన యువకుడు…
** ఇల్లందు పట్టణం గోవింద్ సెంటర్ లో ఘటన. (ఇల్లందు-విజయం న్యూస్)
ఇల్లందు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హాల్ చల్ చేస్తున్నాడు.. సింగరేణి లాండ్ లుజర్ సుందర్ సింగరేణి అధికారులు అతని పట్ల కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు నా సమస్య ను పరిష్కరించకపోతే పైనుంచి దూకి చనిపోతానని తెలుపుతున్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు సుందర్ ను దింపే ప్రయత్నం చేస్తున్నారు .గోవిందు సెంటర్ లో గూమిగుడిన జనం. ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఇల్లందు డీఎస్పీ, సీఐ, ఎస్ఐ లు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడితో మాట్లాడుతున్నారు.
Allso read:- ఎస్ ఆర్ పి- 3 ప్రమాద ఘటనలో ముగ్గురు అధికారులు సస్పెండ్