Telugu News

నేలకొండపల్లిలో పర్యటించిన రాయల

0

నేలకొండపల్లిలో పర్యటించిన రాయల

== పలుకుటుంబాలను పరామర్శించి, చిన్నారులను ఆశీర్విదించిన కాంగ్రెస్ నేత

(నేలకొండపల్లి-విజయంన్యూస్)

నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు శుక్రవారం ముమ్మరంగా పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించిన ఆయన కొన్ని శుభకార్యాలయాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో నాచేపల్లి గ్రామానికి చెందిన రాయబరపు అశోక్-ప్రగతి కుమారుడి అన్నప్రసాన్న కార్యక్రమానికి హాజరై చిన్నరుడిని ఆశీర్వదించారు..

ఇది కూడా చదవండి: ఆజాద్ పై భట్టి విమ్మర్శల వర్షం

చెరువుమాదారం గ్రామంలో కలకోండ రంగయ్య-వెంకటనర్సమ్మ కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులు రవీంద్ర-శీరిష లను ఆశీర్వదించారు.. అనంతరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించారు. చెరువుమాధారం గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న పాలేరు నియోజకవర్గం యస్.సి సెల్ మాజీ అధ్యక్షులు సూరేపల్లి రవి  భార్య మాధవిని పరామర్శించారు.. చెరువుమాధారం గ్రామంలో ఇటీవల ఆనారోగ్యాంతో మరణించిన యడవల్లి సోమయ్య  చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..  బుద్ధారం గ్రామంలో ఇటీవల ఆనారోగ్యాంతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుగంటి సత్యం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  మంగాపురం తండా గ్రామంలో ఇటీవల ఆనారోగ్యాంతో మరణించిన పడకండ్ల నాగమణి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇది కూడా చదవండి ::-వైరా బస్ స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు,ఖమ్మం జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు,ఈవురి శ్రీనివాస రెడ్డి,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని,పాలేరు నియోజకవర్గం యస్.సి సెల్ మాజి అధ్యక్షులు సూరేపల్లి రవి, నేలకోండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్న నాయక్,నేలకోండపల్లి మండల యస్.సి సెల్ అధ్యక్షులు జిల్లపల్లి నాగేశ్వరరావు,మంగాపురం తండా గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా సీత్య,నందిగామ సత్యం,నేలకోండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు,యాతాకుల శ్రీనాద్,వంగూరి బాలాజీ,గట్టిగుండ్ల విజయ్,ధనవత్ సంతోష్,మేదరమేట్ల సతీష్,పర్వత కనకయ్య,కుమ్మరి వీరబాబు,ధనవత్ హరి,భూక్యా బాలాజీ,తదితరులు పాల్గోన్నారు.