Telugu News

మొక్కను తీసేసిండ్రూ..

గుంతను పూడ్చిండ్రూ

0

మొక్కను తీసేసిండ్రూ.. గుంతను పూడ్చిండ్రూ

— విజయం ప్రతిక కథనానికి స్పందించిన అధికారులు

(ఖమ్మం రూరల్-విజయంన్యూస్)

నడిరోడ్డుపై వెలిసిన మొక్కను ఎట్టకేలకు అధికారులు  తీసేసిండ్రూ.. నడిరోడ్డుపై పడిన గుంతను పూడిసేసిండ్రూ.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసిండ్రూ.. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్ద తండా వద్ద ఖమ్మం-హైదరాబాద్ ప్రధాన రహధారి  నడిరోడ్డుపై గుంతపడింది. ఈ గుంతను పూడ్చాల్చిన అధికారులు ఆ పనులు చేయకుండా వదిలేశారు. దారిన పోయే వారు ప్రజల ప్రమాదాన్ని గుర్తించి ఎండిన మొక్కను తీసుకొచ్చి ఆ గుంతలో పెట్టి.. దానికి రాళ్లు అడ్డం పెట్టారు. దీంతో ప్రయాణికులు కొంత సేప్ అయినప్పటికి రాత్రి సమయంలో ఆ రోడ్డు పై పెట్టిన రాళ్ళు ప్రమాదకరంగా మారాయి. దీంతో ‘విజయం’ దినపత్రికలో ‘నడిరోడ్డుపై వెలిసిన మొక్క’ అంటూ కథనాన్ని ప్రచురితం చేశాము. అలాగే విజయం వెబ్ సైట్లో కథనాన్ని ప్రచురితం చేశాము.

— స్పందించిన అధికారులు

నడిరోడ్డుపై మొక్క వెలిసిందని ప్రతికలో ప్రచురితం చేసిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. తక్షణమే పెద్దతండాకు చేరుకుని మొక్కను తొలగించి రోడ్డుపై పడిన గుంతను కంకరతో పూడ్చారు. అలాగే అక్కడ  వాహనాదారులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో పలువురు విజయం పత్రికను అభినందించారు.ఇలాంటి ప్రజలకు అవసరమైన కథనాలు రాయడం వల్ల సమస్యలను అధికారులు గుర్తించి త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని, అందుకే మీడియా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారదిగా ఉండాలని కోరుతున్నారు.

also read : నడిరోడ్డుపై వెలిసిన ఎండిన మొక్క