రాజుతండా నుంచి 30బీఆర్ ఎస్ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక
పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి
రాజుతండా నుంచి 30బీఆర్ ఎస్ కుటుంబాలు
కాంగ్రెస్ లో చేరిక
== పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి
(కూసుమంచి-విజయం న్యూస్):
మల్లాయిగూడెం గ్రామపంచాయతీ రాజు తండాకు చెందిన 30 బీఆర్ఎస్ కుటుంబాల వారు భూక్య ఉపేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో గురువారం వీరికి పార్టీ కండువాలు కప్పి ప్రసాద్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి:- ఆరు గ్యారంటీలతోనే అందరికీ సంక్షేమ పాలన: పొంగులేటి
మీ శీనన్న కార్యకర్తలకు అండగా ఉంటారని అభయం ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి క్షేత్రస్థాయిలో వివరించి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో భూక్య హుస్సేన్, భూక్య కృష్ణ, బాలు, తేజావత్ సంతోష్, ధరావత్ హరియా, నాగరాజు, వ డిత్య హుస్సేన్, ఉపేందర్, విక్రమ్, వాంకుడోత్ జీవన్, భూక్యాలాలు, నితిన్, హే మూల, సురేందర్ సైదులు తదితరులు ఉన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి గోపి, బాధవత్ నరేష్, పల్లెబోయిన శ్రీనివాస్, మహేష్, లింగా నాయక్, భూక్యా మల్లయ్య, రవి, నాగేశ్వరరావు, మల్సూర్, రామారావు, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
ఇది కూడా చదవండి:- కేశ్వాపురంకు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక