317 రద్దు చేయకపోతే రోడ్డు పడతాం
ఉపాధ్యాయుల ఆందోళన
న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
(హైదరాబాద్ -హైదరాబాద్);-
జీవో 317 రద్దు చేయకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయలందరు రోడ్డున పడతామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 317తో పాటు మల్టీ జోన్‌కు బదిలీలు చేయాలంటూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సోమవారం తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ ఎదుట ఆందోళన చేశారు. జీఏడీ నిబంధనల మేరకే బదిలీలు చేశామని అధికారులు చెప్పినట్లు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. వెంటనే 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
also read:-డిఎస్ చేరికకు లైన్ క్లీయర్
ఇతర జోన్లకు బదిలీ అయిన 40 మంది హెచ్‌ఎంలు సంగారెడ్డి జిల్లాకు చెందినవారే ఉన్నారని వివరించారు. ప్రధానోపాధ్యాయుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురిని అరెస్ట్? చేసి నారాయణగూడ పోలీస్?స్టేషన్?కు తరలించారు. కొవిడ్? నిబంధనలు పాటిస్తూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. అన్యాయంగా అరెస్ట్ చేశారని పలువులు ఉపాధ్యాయులు వాపోయారు. ప్రగతిభవన్ ముట్టడికీ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. భారీగా పోలీసులను మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాల సంఘాల నేతలపై నిఘా పెట్టారు. ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు నగరానికి వచ్చే అవకాశం ఉండటంతో… ఆయా జిల్లాల పోలీసులకు సమన్వయం చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. 317 జీవోను సవరించాలని.. జీవిత భాగస్వామి బదిలీలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియార్టీ జాబితాలోని తప్పులను సవరించాలని, జోన్, మల్టీ జోన్‌లోని తప్పులనూ సరిచేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.