Telugu News

చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?

-- ఇంటి అవరణలో ఉన్న యువతిని లాక్కెళ్లి న ఆటో డ్రైవర్

0

చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?

— ఇంటి అవరణలో ఉన్న యువతిని లాక్కెళ్లి న ఆటో డ్రైవర్

— ఇల్లెందులో వెలుగులోకి ఘటన 

(ఇల్లందు టౌన్_ విజయం న్యూస్)

ఇంటి అవరణ లో ఉన్న యువతిని ఓ ఆటో డ్రైవర్ బలవంతంగా ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన పట్టణంలో వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం ఓ నగర్ కు చెందిన సుమారు 25 ఏళ్ల యువతి గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటి అవరణ లో వుండగా టేకులపల్లి మండలం తడికలపుడి నుండి వచ్చి ఇల్లందు మండలం రాఘాబోయిన గూడెం  లో నివాసం ఉంటున్న ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.సదరు ఆటో డ్రైవర్ మధ్యాహ్న సమయంలో సదరు యువతి ఇంటికి వెళ్ళి తాగునీరు అడగ్గా,యువతి తల్లి అతడికి తాగునీరు ఇచ్చింది ఆ సమీపంలో అతడు సదరు యువతి గురించి ఆరా తీయగా ఆమె చెవిటి, మూగ అని చెప్పగా .. ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.అయితే ఆ తర్వాత కొంత సమయానికి మళ్ళీ వచ్చిన అతడు ఇంటి బయట ఉన్న యువతిని చూసి ఆమె ను బలవంతంగా ఆటో లో ఎక్కించుకొని ఖమ్మం రహదారిలో ని ఓ సి ప్రాంతంలో చెట్ల పోధలకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని యువతి కుటుంబీకులు పిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.అయిదున్నర సమయంలో రాఘాబోయిన గూడెం కు చెందిన ఓ వ్యక్తి సమీపంలో యువతి ని చూసి ఫోన్ లో ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.అయితే అప్పటికే యువతి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు వెంటనే ఓసి ప్రాంతానికి వెళ్లి ఆమెని ప్రశ్నించారు ..మధ్యాహ్న సమయంలో తాగు నీటి కోసం వచ్చిన వ్యక్తి తనను లాక్కొచ్చి అఘాయిత్యం చేశాడని ఆ యువతి సైగల ద్వారా అనావల్లు తెలపడంతో వారు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు.దీనితో సదరు నిందితుడి పై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు .యువతి ని ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య పరీక్షలు చేయించ  నున్నట్లు  పోలీసులు తెలిపారు

also read :ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం