Telugu News

కూసుమంచిలో తుమ్మల వర్గీయులకు రైతులు షాక్

తుమ్మల కృషి కాదు ఎమ్మెల్యే కృషి  ఫలితంగా సమస్య పరిష్కారం అన్న రైతులు

0

కూసుమంచిలో తుమ్మల వర్గీయులకు రైతులు షాక్

== తుమ్మల కృషి కాదు ఎమ్మెల్యే కృషి  ఫలితంగా సమస్య పరిష్కారం

== విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన బాధిత రైతులు

కూసుమంచి, అక్టోబర్ 19(విజయంన్యూస్)

కూసుమంచి మండలంలోని ధర్మతండా టూ గంగబండతండా వరకు ఎస్ఆర్ఎస్ పీ కెనాల్ నిర్మాణం విషయంలో కోర్టులో పంచాయతీ ఉండగా ఆ సమస్యను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరిష్కరించి అక్కడ సుమారు 8వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేశారని బాధిత రైతులు తెలిపారు. కాలువ సమస్యను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిష్కరించాని తుమ్మల వర్గీయులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పత్రాలేందుకు..? పైసలీవ్వూ..?

బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ (భక్త రామదాసు) బాధిత రైతు బెల్లంకొండ నాగన్నతన హోటల్లో రైతులు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఐదు సార్లు  మాతో సమావేశమయ్యారని,  నాలుగు సార్లు జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి, మమ్మల్ని సమావేశపరిచి న్యాయబద్ధంగా మేము కోరుకున్నట్లు రూ.15 లక్షలు ఇప్పించడానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే  కృషికి రైతులుగా మేము ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. మంగళవారం కొంతమంది సమావేశమై తుమ్మల  కృషి వల్ల రూ.15 లక్షలు మంజూరు అయినట్టు చెప్పారని,  ఇది ఎంతవరకు నిజం కాదని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తుమ్మల చేసి ఉంటే ఈ సమస్య 2016 లోనే పరిష్కారం అయ్యేదని, ఆనాడు మంత్రిగా  ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోని ఆయన నేడు ఆయనే చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే  వందల సంఖ్యలో ఫోన్  చేసేవారు- రైతుల తరపు లాయర్,  బాధిత రైతులు 2016లో నా దృష్టికి తీసుకువచ్చారని, ఆనాడు సరైన సహకారం  లేక సమస్యను పరిష్కరించలేకపోయానని ఎమ్మెల్యే గత రెండు సంవత్సరాల క్రితమే చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి బాధ్యత తీసుకొని  రైతులతోనూ అధికారులతోనూ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారని, ఎమ్మెల్యే చొరవతో ఒక ఎకరానికి రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందన్నారు. శనివారం  లోక్- అదాలత్ లో పెట్టి తర్వాత ఎకరానికిరూ. 15 లక్షల చొప్పున ఆర్డీవోతో అవార్డు రిలీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఇదంతా కందాళ ఉపేందర్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. ఈ సమావేశంలో జర్పుల  లచ్చిరం , జర్పుల  శ్రీరామ్, తేజావత్ శీను, జర్పుల సీతారాములు, వడ్త్యా సీతారాములు, వడిత్య సోమల, బెల్లంకొండ వెంకన్న, బెల్లంకొండ నాగన్న ఇతరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: “దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?