పాలేరు నియోజకవర్గంలో 36 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు
ఎమ్మెల్యే కందాళ కు ధన్యవాదాలుతెలిపిన సర్పంచులు, ప్రజలు
పాలేరు నియోజకవర్గంలో 36 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు
== ఎమ్మెల్యే కందాళ కు ధన్యవాదాలుతెలిపిన సర్పంచులు, ప్రజలు
(కూసుమంచి-విజయంన్యూస్)
నూతనంగా ఏర్పాటైన పంచాయతీలకు భవనాలు లేవు. అద్దే భవనాల్లోనే ఇప్పటి వరకు పంచాయతీ పరిపాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సర్పంచులు ఇటీవలే పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలను మంజూరు చేయాలని వినతి చేశారు. కాగా ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ మంత్రికి, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి భవనాల మంజూరు విషయాన్ని కోరగా, స్పందించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నూతన పంచాయతీలకు భవనాలను మంజూరు చేశారు. అందులో భాగంగానే పాలేరు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుండి 36 గ్రామపంచాయతీలకు నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు చేశారు.
allso read- ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పలు గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించుకోవడానికి, గ్రామ సంబంధిత రికార్డులను తదితర సమాచారాన్ని భద్రపరచుకోవడానికి గ్రామపంచాయతీ భవనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ శాఖ ఎర్రబల్లి దయాకర్ రావు తమ సిఫారసు మేరకు క్రితం వినతి పత్రాన్ని అందజేయగా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 36 గ్రామపంచాయతీలకు నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. దీంతో ఆయా పంచాయతీల సర్పంచులు, ప్రజలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుకి, పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
== భవనాలు మంజూరైన పంచాయతీలు ఇవ్వే
పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలంలో ఆరకొడు తండా, బారుగూడెం, గొల్లగూడెం, పొన్నెకల్, కూసుమంచి మండలంలో అగ్రహారం, భగత్ వీడు తండా, బోడియతండా, చేగొమ్మ, ధర్మాతండా, గైగొల్లపల్లి, గొరిళ్ళపాడుతండా, జక్కేపల్లి SC కాలనీ, నాయకన్ గూడెం, పోచారం, రాజుపేట, రాజుపేట బజార్, లింగారం తండా నేలకొండపల్లి మండలంలో అమ్మగూడెం, అప్పలనరసింహపురం, బైరవునిపల్లి, మంగాపురం తండా, ముఠాపురం, నాచేపల్లి, రాజారంపేట, రాయిగూడెం, సదాశివపురం, అజయ్ తండాలకు నూతన భవనాలను మంజూరు చేశారు. అలాగే తిరుమలాయపాలెం మండలంలో హస్నాబాద్, హైదర్ సాయి పేట, జల్లేపల్లి, ఏలువారిగూడెం, అజ్మీర్ తండా, ఇస్లావత్ తండా, లక్ష్మీదేవిపల్లి తండా, మేకల తండా, పడమటి తండా గ్రామపంచాయతీలకు నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు.
allso read- తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ