Telugu News

జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ ముందంజ..?

బారీ ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం

0

జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ ముందంజ..?

— బారీ ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం

(ఖమ్మం -విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో ఉన్న జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో పోట్ల శ్రీకాంత్ విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.. కార్యదర్శి పదవి కోసం పోట్ల శ్రీకాంత్ ప్యానల్, అలాగే పోటు శరత్ కుమార్ ప్యానల్ పోటీపడగా ఆదివారం పోలింగ్ జరిగింది అందుకుగాను మొత్తం 2915 ఓట్లకు గాను 2135 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రకారం శ్రీకాంత్ విజయం వైపు దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. హోరాహోరీగా జరుగుతున్న లెక్కింపులో భారీ మెజార్టీతో శ్రీకాంత్ గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు రానున్నాయి.

also read : వృద్దురాలుకు వెంటవెంటనే డబుల్ డోస్