కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన 50 కుటుంబాలు..
== కండువ కప్పి స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం కార్పొరేషన్ 28వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు స్థానిక కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న అధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి:- యువత దేశానికి వెన్నుముక : ఎమ్మెల్యే కందాళ
వారికి మంత్రి పువ్వాడ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తురక వెంకన్న, శాగ బగ్గలయ్య, చెరుకుపల్లి రాంబాబు, జీ నాగేశ్వర రావు, పత్తికొండ వెంకటేశ్వర్లు, జి పుల్లారావు, పాముల కృష్ణమూర్తి, చౌడబోయిన రాందాసు, మదాసి జనార్ధన్, తాటికొండ మోహన్ రావు, పొడకంటి వేణు, పిల్లలమర్రి తిరుపతయ్య, బంగారు సత్యనారాయణ, సంకీసుల వెంకటేశ్వర్లు, వెంకట రమణ, చెరుకూరి సుధాకర్, కోటిబోయిన పర్వతాలు, కళ్లెం సత్తిరెడ్డి, ఆలేటి రాము, బ్రహ్మం, నల్లబెల్లి సోమ శేఖర్, శ్రీనివాస్, వెంకయ్య, రామారావు తదితరులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమం ప్రతి గడపకు తెలిసేలా వివరించి ఓటు అభ్యర్దించి పార్టీ ని అఖండ మెజారిటీ తో గెలిచేలా పని చేయాలన్నారు.
ఇది కూడా చదవండి:- సంక్షేమంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్:మంత్రి
ఈ కార్యక్రమంలో మయోర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న, విద్యుత్ డివిజన్ అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, కొప్పెరా నర్సింహా రావు, దడాల రఘు, సుంకర సతీష్, లింగయ్య, బాసిపొంగు వెంకటేశ్వర రావు, గంగరబోయిన రవి తదితరులు ఉన్నారు.