Telugu News

శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేత

శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు

0
శ్రీనివాస రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది
== ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేసిన మేయర్, అటవీ శాఖ సీసీఎఫ్
== శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు
(ఖమ్మం-విజయం న్యూస్)
ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబొడు ఘటనలో మృతి చెందిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంకు చెందిన ఎఫ్ఆర్వో  శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని వారి కుటుంబానికి అందజేసిన మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, అటవీశాఖ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్వో సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్ లు అందజేశారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు మేయర్ సుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్ లు, అటవీ శాఖాధికారులు  ఆయా చెక్కును శ్రీనివాసరావు కుటుంబానికి అందజేశారు.
శ్రీనివాస రావు భార్య పిల్లలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఏం భయపడాల్సిన అవసరం లేదని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో ప్రభుత్వం నుండి రావాల్సినవన్ని వస్తాయని హామి ఇచ్చారు.శ్రీనివాస రావు మృతి బాధాకరమని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ హామి మేరకు స్ధానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించిన విధంగా నేడు రూ.50లక్షలు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర అన్ని హామీలను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం శ్రీనివాస రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ శ్రీనివాస్ రావు అంటూ నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి:- సుందరనగరంగా ఖమ్మం : సీఎం కేసిఆర్ ప్రసంశ
ఈ కార్యక్రమంలో మలోత్ గౌరి, తహాసిల్దార్ నర్సింహారావు, ఎఫ్ఆర్వో రాధిక, మంత్రి పీఏ రవికిరణ్, నాయకులు మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్ రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకరర్ తదితరులు ఉన్నారు.