Telugu News

500 కోట్లతో మెడికల్ కళాశాల

- వైద్య రంగంలోనే ఇది చెరగని అధ్యాయం

0

500 కోట్లతో మెడికల్ కళాశాల
– వైద్య రంగంలోనే ఇది చెరగని అధ్యాయం
– ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి
(మంచిర్యాల ప్రతినిధి- విజయం న్యూస్):
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 500 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడించారు. గురువారం పట్టణంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు విలేకర్లతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం లోనే తరగతులు ప్రారంభించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాల ఏర్పాటుకు తాత్కాలికంగా నిధులను కేటాయించడంతో పాటు నిర్మాణ పనులు చేపడుతున్నామని వివరించారు.

బాగానే 32 ఎకరాల భూమిని సేకరించినట్లు చెప్పారు. ఇందులో పది ఎకరాల భూమి మార్కెట్ కమిటీదీ కాగా మిగిలిన ఇరవై రెండు ఎకరాలు భూదాన్ భూమి అని దివాకర్ రావు స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో మంచిర్యాల ఆసిఫాబాద్ పిల్లలే కాకుండా పరిసర ప్రాంతాల వారికి వైద్య సదుపాయం ఎంతో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విధంగా వైద్య వృత్తిలో చేరే విద్యార్థులకు ఇది మహత్తర వరమని ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు దివాకర్ రావు సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి అభిరామం కృషి చేస్తున్నానని చెప్పారు.

ఎల్లంపల్లి లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టు తో పాటు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నియోజకవర్గానికి మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. రానున్న రోజుల్లో నూ మరిన్ని అభివృద్ధి పథకాలను సాధించడానికి కృషి చేస్తానని అని ఆయన సందర్భంగా స్పష్టం చేశారు కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన వారిలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రాజయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

also read:-*కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు : బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్