Telugu News

గౌరవ వేతనం పెంపుతో54,201 మందికి లబ్ది

మధ్యాహ్న భోజనం వంట కార్మికుల్లో ఆనందం

0

గౌరవ వేతనం పెంపుతో54,201 మందికి లబ్ది

మధ్యాహ్న భోజనం వంట కార్మికుల్లో ఆనందం

(హైదరాబాద్-విజయం న్యూస్):-

సర్కారు బడుల్లో విద్యార్థు లకు మధ్యాహ్న భోజనం వండి పెట్టే మహిళా వంట కార్మికులకు ఎట్టకేలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారి గౌరవ వేతనాన్ని నెలకు రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళ వారం శాసనసభలో ప్రకటించారు.

also read;-వెల్లువెత్తిన సంబరాలు..

దీంతో మహిళా కార్మి కుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బడుల్లో 54201 మంది మహిళా వంట కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటివరకు రూ. వెయ్యి చొప్పున వేతనం వల్ల ఏడాదిలో 10 నెలల కాలానికి రూ.54.20 కోట్ల నిధులు అవసరమయ్యేవి. రూ.3 వేలకు పెంచిన నేప థ్యంలో రూ.162.60 కోట్లు నిధులు కావాలి. కేంద్రం తన వాటా కింద రూ.600 చొప్పున మాత్రమే ఇస్తుంది. మిగి లిన 2,400 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.