Telugu News

మురుస్తున్న పత్తి ధర..

రికార్డ్ స్థాయిలో ధరలు..

0

మురిపిస్తున్న తెల్లబంగారం

★ మార్కెట్లలో పత్తి దూకుడు

★ ‘మద్దతు’ను మించిన ధర

★ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో లాభసాటి
పంటల సాగుపై రైతుల ఆసక్తి

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

గత ఏడాది క్వింటాకు రూ. నాలుగైదు వేలు పలికిన పత్తి ధర ఈసారి రూ.8వేలు దాటింది. వరంగల్ జిల్లా నెక్కొండలో మంగళవారం అత్యధికంగా రూ. 8,350కి దూసుకెళ్లింది. మరో నాలుగు జిల్లాల్లోనూ రూ. 8వేలను మించింది. బులియన్ మార్కెట్ రోజురోజుకూ ధరల్లో తేడా కనిపిస్తోంది. మద్దతు ధర కన్నా రూ.2 వేలు ఎక్కువ పలుకుతుం డటంతో ఈసారి సీసీఐ కొను గోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈపాటికే సీసీఐ కాటన్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు ప్రారంభమవ్వాల్సి ఉండగా అసలు ఆ ఆలోచనే చేయకపోవ డానికి కారణం అధిక ధరలేనని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ విపణిలో పత్తికి డిమాండున్నా అనుకున్న రీతిలో దిగుబడులు లేవు. ఈ నేప థ్యంలో ఇప్పుడున్న పంటకు భారీగా ధరలు పలుకుతు న్నాయి. ఈసారి రాష్ట్రంలో 42ల క్షల ఎకరాల్లో పత్తి సాగవగా 3కోట్ల క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని అంచనా. రాష్ట్రవ్యా ప్తంగా 376 జిన్నింగ్ మిల్లులుం డగా, సీసీఐ కొనుగోళ్లు లేక మిల్లుల యజమానులే పత్తిని కొంటున్నారు. తెల్ల బంగారం కనిష్ఠ మద్దతు ధర రూ. 6,025. అది 8 శాతం తేమతో ఉంటేనే ఆమాత్రం చెల్లిస్తారు. కానీ అనేక మంది రైతుల పత్తిలో తేమ శాతం ప్రస్తుతం 15-20 వరకు ఉంది. అయినా మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. సీసీఐ కొనే సరకు 8-12 శాతం తేమతో ఉండాలి. కానీ 20 శాతం తేమతో కూడిన పత్తికి వ్యాపారులు, మధ్యవర్తులు రూ. 8వేల వరకు చెల్లిస్తున్నారు. ఆది వారం ఉదయం క్వింటాకు రూ. 7,500, సాయంత్రం రూ.7,600 పలికింది. సోమవారం ఉదయం రూ.7,600 ఉన్న ధర సాయం త్రానికి రూ. 7,700కు చేరింది. మంగళవారం గరిష్టంగా ధరలు పలికాయి.

ఊపందుకున్న విక్రయాలు
———————-
ధరలు పెరుగుతుండటంతో కొందరు రైతులు పత్తిని ఇప్పుడే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబ డులు సగానికి తగ్గినా చేతికందిన పంట నాణ్యంగా ఉంది. ఆగ స్టులో భారీ వర్షాల కారణంగా చేలల్లో నీరు చేరి చాలా వరకు పత్తి దెబ్బతింది. పెట్టుబడులు, కౌలుధరలు పెరగడంతో రైతులు అయోమయంలో పడినా మంచి ధరలు వస్తుండటంతో ఊరట చెందుతున్నారు.

మంగళవారం పత్తికి పలికిన ధరలు
—————————–
మార్కేట్ క్వింటాకు ధర
——————————
నెక్కొండ రూ.8,350
గజ్వేల్ రూ.8,261
జమ్మికుంట రూ.8,150
నారాయణపేట రూ.8,150
అదిలాబాద్ రూ.8,020
ఇంద్రవెల్లి రూ.7,970
వరంగల్ రూ.7,960
జైనూర్ రూ.7,920
నిర్మల్, ములుగు రూ.7,900
ఖమ్మం రూ.7,800
కరీంనగర్ రూ.7,758
కుభీర్ రూ.7,600
మోత్కూర్, చొప్పదండి రూ.7,500
ఎన్కూర్ రూ.7.300
నార్నూర్ రూ.6871
లక్షెట్టి పేట్ రూ.6,100
నారాయణఖేడ్ రూ.6,025

also read :- మరో 24గంటలే..?