ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు వారి ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాన్ని వారికే పూర్తి హక్కులు కల్పించి నిశ్చింతగా జీవంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంధ్రశేఖర్‌రావు ఆలోచన చేసి ప్రభుత్వ ఉత్వర్వునెం.58 పథకం క్రింద పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్ధిక స్తోమత లేని వారికి కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సహాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం భక్తరామదాసు కళాక్షేత్రంలో 398 మంది లబ్ధిదారులకు జి.ఓ.58 పట్టాలు, గృహలక్ష్మి పథకం క్రింద 230 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్వర్వులు జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలిసి అందజేశారు.
లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మూడు విడతలుగా లబ్ధిదారుని ఖాతాకు నగదు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లునీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, డిప్యూటీ కమీషనర్ మల్లీశ్వరీ, ఆర్.డి.ఓ గణేష్, తహశీల్దారు స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.