Telugu News

ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తో పాడి గేదె మృతి

బోరుమన్న రైతు

0

ట్రాన్స్ఫార్మర్స్ తగిలి  పాడిగేదె మృతి

** బోరుమన్న రైతు..

(కన్నాయిగూడెం-విజయం న్యూస్)

కన్నాయిగూడెం మండల కేంద్రంలో స్థానిక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద గుర్రేవుల గ్రామానికి చెందిన
షేక్ నబీ సంబంధించిన పాడిగేదె మెతకువెళ్లి ఆ ట్రాన్స్ ఫార్మర్ కు తగిలి విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ.30వేల  విలువ గల గేదె చనిపోవడంతో కూలిరైతు తీవ్రంగా నష్టపోయాడు.  గేదె వద్దకు వచ్చి షేకు నబీ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇప్పటికైన సంబందిత విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు, ట్రాన్స్ఫార్మర్, చుట్టు కంచే లేకపోవడంతోనే గేదే చనిపోయిందని ఇప్పటికీ ఇలా చాలా పశువులు, ముగజీవాలు మృతిచెందాయని, అయినప్పటికి కంచే మాత్రం ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానికుల ఇండ్ల మీదనుండి కరెంట్ మెయిన్ వైర్లు ఇండడంతో తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నామన్నారు. మాకు ఏ సమయంలో ఏమిజరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఆ కరెంట్ మెయిన్ వైర్లు తొలగించి రోడ్డు మార్గం గుండా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

also read: 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు