Telugu News

రైతు ఉత్పత్తి సంఘాల తోనే రైతు మనుగడ

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి అనసూయ

0

రైతు ఉత్పత్తి సంఘాల తోనే రైతు మనుగడ
*ఆరు రోజుల మహారాష్ట్ర పర్యటన లో ఉన్న 100 మంది జిల్లా ఉద్యాన రైతులు
*వివిధ పంటల పరిశీలన
*రైతులు వ్యాపారస్తులు గా ఎదగాలి
*జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి అనసూయ
(ఎర్రుపాలెం-విజయం న్యూస్ ):
జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆరు రోజుల మహారాష్ట్ర పర్యటన లో ఉన్న 100 మంది ఉద్యాన రైతులు నాసిక్ చుట్టు పక్కల ప్రాంతాలలో అక్కడి రైతులు సాగు చేస్తున్న ద్రాక్ష, దానిమ్మ, ఉల్లి, గులాబి పంటలను పరిశీలించారు..ద్రాక్ష లో వివిధ రకాలైన థామ్సన్ సీడ్లెస్, క్రింసన్, అనాబ్ ఈ షాహి వంటి రకాల తోటలను పరిశీలించారు.. ద్రాక్ష సాగు పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.. అక్కడి రైతులందరూ వారి తోటలలో చిన్న పాటి *వాతావరణ కేంద్రాలను* ఏర్పాటు చేశారు.. వాటి పనితీరు ను అడిగి తెలుసుకున్నారు..

నిండా మునిగిన రైతన్న.. పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు.

దాదాపు రైతులందరూ సాంకేతికత ఉపయోగించి పంటల సాగు చేపడుతున్నారు.. మొక్కల పెంపకం నుండి కోత వరకు యంత్రాల ద్వారానే చేస్తున్నారు.. ఎరువులు, పురుగు మందుల వినియోగానికి, నీటి యాజమాన్యానికి సైతం సెన్సార్లు వాడుతూ ఉండటం మన రైతులను ఆశ్చర్యానికి గురి చేసింది.. ఎక్కువ మంది రైతులు సేంద్రియ పద్ధతులు వినియోగించి వాణిజ్య పంటలు సాగు చేయటం అక్కడ మరో విశేషం..ఈ నెల ఇరవై ఒక్కటి నుండి ఇరవై ఆరు వరకు ఆరు రోజుల పాటు ఈ ఉద్యాన రైతు విజ్ఞాన యాత్ర జరుగనుంది…రైతులు ఒకరి మీద ఆధారపడకుండా, ప్రభుత్వాలు ఏదో చేస్తాయి అని ఎదురు చూడకుండా, గ్రూపులుగా, రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడి అనేక దేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం ఈ దేశానికే గర్వకారణం అని, రైతులు వ్యాపారస్తులు గా ఎదిగి లాభాలు గడించాలని ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి శ్రీమతి జీ అనసూయ గారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారులు శ్రీ గుడిమళ్ల సందీప్ కుమార్, శ్రీ నగేష్, కుమారి మీనాక్షి, శ్రీ ఆకుల వేణు, సిబ్బంది రచన , జిల్లా నుండి 100 మంది ఉద్యాన రైతులు పాల్గొన్నారు…

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*