Telugu News

ఇటు రావోద్దంటున్న తాటికొమ్మ

వస్తే ప్రమాదమంటున్న తాటికొమ్మ..జాతీయరహధారి నడిరోడ్డపై ఏర్పడిన గుంత

0

గుంతుందని చెబుతున్న తాటికొమ్మ

— జాతీయ రహధారి నడిరోడ్డపై ఏర్పడిన గుంత

— ఫ్రమాదాన్ని తప్పించేందుకు తాటికొమ్మ అడ్డగింత

— అధికారుల పనితీరుకు అద్దం పడుతున్న వింత 

(ములుగు -విజయం న్యూస్)

అదో  163వ నంబర్ కల్గిన జాతీయ రహధారి.. నిత్యం వేలాధి వాహనాలు తిరుగుతున్న రోడ్డు.. అలాంటి రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది.. ఆ గుంతను పూడ్చాల్సిన అధికారులు పట్టించుకోలేదు.. దారిన పోయే దానయ్య ప్రమాదం జరుగుతుందో ఏమోనని..? తాటికొమ్మను అందులో పెట్టి ప్రమాద హెచ్చరికను తెలుపుతున్నాడు.. గొయ్యిని పూడ్చవల్సిన బాధ్యత ఆర్ అండ్ బి అధికారులకు లేదా..? -నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం… -ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏటూరునగర్ నుండి మణుగూరు వెళ్లే జాతీయ రహదారి 163 మంగపేట మండలం, వాడగూడెం గ్రామ పంచాయతీ దగ్గర సుమారు నాలుగు అడుగుల లోతుతో, రెండున్నర అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడింది.నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ రద్దీగా ఉండే ఈ రహదారిపై గుంత ఏర్పడి పక్షం రోజులు అయింది. ఈ జాతీయ రహదారి 163 పై గొయ్యి ఏర్పడి పక్షం రోజులు గడుస్తున్నా ఆర్ అండ్ బి కి సంబంధించిన అధికారులు ప్రధాన రహదారిపై ఏర్పడిన గొయ్యిని గుర్తించి పూడ్చక పోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనం. ప్రమాదకరంగా ఉన్న గొయ్యిలో వాడగూడెం గ్రామస్తులు బాధ్యత గల పౌరులుగా తాటి కమ్మలతో, ఖాళీ సంచితో ప్రమాద సూచిక ఏర్పాటు చేశారు.ఇప్పటికైనా జాతీయ రహదారి సంబంధిత అధికారులు స్పందించి అతి ప్రమాదకరంగా ఉన్న గొయ్యిని పూడ్చి వేసి ప్రమాదాలు జరగకుండా నివారించవలసిన బాధ్యత ఉన్నదని వాహనదారులు కోరుతున్నారు.

also read: చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?