Telugu News

పశు గోస పట్టదా?? వెంకటాపురం పశు వైద్యశాలకు తాళం

వెంకటాపురం-విజయం న్యూస్

0

పశు గోస పట్టదా??
వెంకటాపురం పశు వైద్యశాలకు తాళం
 ప్రజా ప్రతినిధులు హెచ్చరించిన మారని పశు వైద్య అధికారి తీరు
మండల ప్రజా పరిషత్ సమావేశానికి ప్రతిసారి హాజరు కానీ అధికారి

( వెంకటాపురం-విజయం న్యూస్);

పశువుల ప్రాణాలు పోతున్నా పశు వైద్యాధికారి పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో పనిచేస్తున్న పశు వైద్య అధికారి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న ప్రధాన పశు వైద్య శాలకు ఎప్పుడు తాళం వేసి ఉంటుంది అనే సమస్యను సర్పంచ్ చిడెం యామిలి దృష్టికి తీసుకవెళ్లారు.పశు వైద్య శాలను సందర్శించి సంబంధిత అధికారులకు తెలియచేస్తా అన్నారు.పశు వైద్యులు అందుబాటులో లేకపోవడం తో అనేక పశువులు తరుచూ మృత్యువాత పడుతున్నాయి. ఏజెన్సీ మండలం కావడంతో , నన్ను అడిగే వారు లేరు అనే విధంగా ఉంది పశు వైద్యాధికారి తీరు.

also read ;-**గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించిన టి.ఎస్.ఆర్టీసీ. 

ఏజెన్సీ లో ఆదివాసీల జీవన విధానం ఎక్కువగా పశు సంపద మీదే ఆధారపడి ఉంటుంది. పశు వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీలు నాటు వైద్యాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో పలుమార్లు సదరు వైద్యాధికారి తీరు పై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉన్న పై అధికారుల అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయంటూ లెక్కచేయడం లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే ఆధునిక వ్యవసాయ విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి పశు సంపద క్షీణిస్తున్న ఈ తరుణంలో పశు పోషణ భారమై , సమయానికి వైద్యం అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న పశువులను అమ్ముకునే దయనీయ స్థితితికి పశు పోషకులు చేరుకున్నారు.

ప్రజల కష్టాన్ని జీతాలుగా పొందుతున్న అధికారి ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యహరించడం పై ఉన్నతాధికారుల అండదండలు నిజంగానే ఉన్నాయేమో అనే సందేహాలు ఎన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి.పశు వైద్య శాల పై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మండల కేంద్రంలో వున్న పశు వైద్య అధికారులు విధుల నిర్లక్ష్యంపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటే తప్ప మార్పు రాదని ప్రజలు భావిస్తున్నారు.

alo read :-‘పాలేరు’ నుంచి పోటీకి రె‘ఢీ’
స్థానిక సర్పంచి చిడెం యామిలి గురువారం పశు శాలను సందర్శించడం జరిగింది.పశు వైద్యశాలకు తాళం వేసి ఉండటంతో వైద్యాధికారి తీరు పై యామిలి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఎప్పుడు వెళ్లినా అధికారి అందుబాటులో ఉండటం లేదని అన్నారు. . ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మండల పశు వైద్యాధికారి హాజరు కావడం లేదు.మండల పశు వైద్యాధికారి తీరు పై జిల్లా పరిపాలనా అధికారి కృష్ణ ఆదిత్య దృష్టికి త్వరలోనే తీసుకు వెళ్లనున్నట్లు యామిలి తెలియజేసారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు .