Telugu News

మున్నేరు వరదలో చిక్కుకున్న 80మంది..

ఎన్డీఆర్ఎఫ్ తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

0

మున్నేరు వరదలో చిక్కుకున్న 80మంది

== ఒకరు చనిపోగా, మరోకరు స్థానికులు రక్షించారు

== ఎన్డీఆర్ఎఫ్ తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

== 78ని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్

== ధన్యవాదాలు తెలుపుతూ అందర్ని సన్మానించిన మంత్రి, కలెక్టర్, సీపీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మున్నేరు ఉద్రిత్తికి వరదలో 80మందికి పైగా చిక్కుకపోయారు. ఒక్క సారిగా వరదఉదృతి పెరగడంతో అందర్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో ఇండ్లపై ఉన్న ప్రజలు వరదలో చిక్కుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తక్షణమే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలను పిలిపించగా వారు 78మందిని కాపాడి ప్రాణాలను రక్షించారు. జలగం నగర్ కు చెందిన పెండ్ర సంతోష్ అనే యువకుడు చనిపోగా,  జల్లి రాంబాబును స్థానికులు కాపాడారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు చేసిన సేవలను కొనియాడుతూ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ సభ్యులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF సిబ్బంది తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నాను. నాతో పాటు గంట గంటకు పెరుగుతున్న మున్నేరు ఉదృతి ని మంత్రి పువ్వాడ జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో కలిసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.  ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయగా పలు ప్రాంతాల్లో NDRF సిబ్బందితో బోట్ లో ఇంటింటికీ వెళ్ళి క్షుణ్ణంగా వెతుకుతూ మైక్ ద్వారా వరదలో మునిగిన ఇంటి ముందు పిలుస్తూ.. ఇంకా ఇళ్ళల్లో చిక్కుకున్న వారికి రక్షించారు. NDRF కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుండి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో NDRF బృందం విస్తృతంగా పర్యటించి ఇళ్లలో, మెడ పైన మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందుకే వారందర్ని అభినందిస్తున్నామంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు వారియర్ తదితరులు పాల్గొన్నారు.