Telugu News

అన్నపురెడ్డిపల్లిలో  90 క్వింటల రేషన్ బియ్యం పట్టివేత

వివరాలు వెల్లడించిన సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ 

0

అన్నపురెడ్డిపల్లిలో  90 క్వింటల రేషన్ బియ్యం పట్టివేత

== వివరాలు వెల్లడించిన సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ 

చండ్రుగొండ/ అన్నపురెడ్డిపల్లి మే 23 (విజయం న్యూస్ ):-

(రిపోర్టర్ -శివనాగిరెడ్డి)

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ఏఎస్ఐ సర్దార్ పోలీసులతో కలిసి ఉదయం5 గంటల సమయంలో పట్టుకున్నట్లు అన్నపురెడ్డిపల్లి మండలం సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు.
భదాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామ సమీపంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు 90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సుమారు వాటి విలువ 1,17000/- రూపాయలు ఉంటుందని తెలిపారు.

ప్రధాన రహదారిపై తరలిస్తున్న క్రమంలో వద్ద పక్కా సమాచారం మేరకు (ఏపీ 07టీ ఫ్ 9068) డీసీఎం వ్యాన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం వాహనాన్ని సీజ్ చేశారు..

== ఐదుగురి పై కేసు నమోదు

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఐదుగురి పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిధిలోని గుంపెన రేషన్ షాపు నందు అక్రమంగా తరలిస్తున్న 90 క్వింటాల రేషన్ బియ్యం ను అధిక ధరకు అమ్ముకొని అక్రమ బాటలో డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఇలాంటి పనులు చేస్తున్న వ్యాపారులు డీలర్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్ర శేఖర్ తెలిపారు….