9వ రోజు కార్యదర్శుల రంగవల్లికలతో నిరసన
(కూసుమంచి-విజయంన్యూస్)
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 9 రోజులుగా పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుండగా శనివారం 9వ రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెలో భాగంగా మండల అధ్యక్షుడు అంబాల అంజయ్య ఆధ్వర్యంలో వైరేటీగా నిరసన తెలిపారు. రంగవల్లికల రూపంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చేపట్టే విధులు, బాధ్యతలను ప్రదర్శించారు. ఆ రంగవల్లిక చాలా అకట్టుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం అగదని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు అంబాల అంజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటాం: కాంగ్రెస్