Telugu News

ఎరుపెక్కిన భద్రాచలం

_పొడు భూమి అంగుళం లాక్కున్న ప్రతిఘటన తప్పదు..

0

ఎరుపెక్కిన భద్రాచలం
_పొడు భూమి అంగుళం లాక్కున్న ప్రతిఘటన తప్పదు..
_సీపీఐ ఆధ్వర్యంలో వేలాది మంది పొడు భూమి సాగుదారులు భద్రాద్రిలో ప్రదర్శన
_అటవీ శాఖ కార్యాలయం దిగ్భందం
_పొడు భూముల్లో నిర్బంధం అపకపోతే .అడుగడుగునా అడ్డుకుంటాం..
_సి పి ఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా…
_పోరాడి సాధించిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకపోతే ఎంతకైనా తెగిస్తాం…
సి పి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్
(భద్రాచలం_విజయం న్యూస్):-
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని. 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని .పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిమంది పోడు సాగుదారులు భద్రాచలం పట్టణంలో కదంతొక్కారు. వేలాది మంది పోడు భూమిసాగు దారుల ప్రదర్శనతో భద్రాద్రి ఎరుపెక్కింది .. అనంతరం పొడు భూమి సాగుదారులు. గిరిజన రైతాంగం. డివిజన్ అటవీ శాఖ కార్యాలయాన్ని దిగ్బంధించారు…

also read;-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులకు స్వాగతం పలికిన ఖమ్మంజిల్లా టీడీపీ నాయకులు..
అనంతరం జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ పోడు సాగు దారులపై అటవీశాఖ నిర్బంధాలు ఆపకపోతే ప్రతిఘటన తప్పదని అన్నారు. అటవీశాఖ అధికారుల దౌర్జన్యం వల్ల ఇప్పటికే జిల్లాలో గిరిజన రైతాంగం భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న పోడు భూములు జోలికి వస్తే అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు .ప్రభుత్వం హడావుడిగా మూడు నెలల క్రితం సర్వేలు చేస్తామని చెప్పి సర్వేలు పక్కనపెట్టి దాడులు చేయడం పోడు భూములు లాక్కోవడం హేయమైన చర్య అని అన్నారు…
అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూమి సాగు దారులపై దాడి చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దౌర్జన్యంగా భూములపై వచ్చి అటవీశాఖ అధికారులు దాడులు చేస్తే ప్రజలంతా ఐక్యమై తిరుగుబాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు…

also read;-ఖమ్మంలో.. తీగల వంతెనను పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఈ ధర్నాకు సిపిఐ ఎంఎల్ ప్రజా పందా రాష్ట్ర నాయకులుకెచ్చేల. రంగారెడ్డి మద్దతు తెలియజేశారు..
ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు. గిరిజన సమాఖ్య నాయకులు కుంజా. శ్రీనివాసరావు .వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేసు ఎల్లయ్య. తమ్మళ్ల.వెంకటేశ్వరరావు,నుపా తిరుపతి. ఎంపీటీసీ పాలంచ రామారావు, కొరస రమేష్.బొల్లోజు వేణు, అకోజు సునీల్ కుమార్, బల్లా సాయి కుమార్, నోముల రామి రెడ్డి .అడ్డగర్ల తాతజీ, పేరలా శ్రీనివాసరావు, కల్లూరి శ్రీ రాములు మీసాల భాస్కరరావు, నర్సింహులు, నాయకులు మారెడ్డి గణేష్, తిరుపతి రావు,కొల్లిపాక శివ,భరణి హరీష్, రమణమ్మ, మంగమ్మ, లక్ష్మీ బాయ్, తిరుపతమ్మ , పాల్గొన్నారు…