Telugu News

ఇల్లెందులో ట్రెండింగ్ నేత ‘సంజీవ్’

‘నాయక్’ వైపు పెద్దాయిన చూపు

0

ట్రెండింగ్ నేత ‘సంజీవ్’

** ‘నాయక్’ వైపు పెద్దాయిన చూపు

** మూడేళ్లుగా ఇల్లెందు పై ఫోకస్..

** వరస పర్యటనలతో బిజి బిజీ..

** మారుమూల గ్రామాలను సందర్శిస్తున్న ‘నాయక్’

** తుమ్మల ఆశీస్సులతో ముందుకు పయనం

(తమ్మిశెట్టి, ఇల్లెందు- విజయం న్యూస్)

సంజీవ్ నాయక్…! ఈ పేరు ఇప్పుడు ఇల్లెందులో బ్రాండ్ గా మారింది..  ఏడాది కాలంగా ఆయన పేరు మారుమోగుతుంది.మూడేళ్ల నుంచి ఇల్లెందు నియోజకవర్గంపై దృష్టి పెట్టిన ఆయన వరుస పర్యటనలతో జనంలోకి వెళ్తున్నారు. ఆలయాల శంకుస్థాపన, శుభకార్యాలకు హాజరవుతున్న ఈ నాయకుడు, ప్రజల్లను కలుస్తూ కలుపుకుని పోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. బంజార బిడ్డ అయిన సంజీవ్ నాయక్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నాయకుడి కన్ను పడినట్లు కనిపిస్తోంది. ఆయన అనుచరుడిగా ఉన్నప్పటికి ప్రత్యేకంగా ఆయన పేరుతో ఇల్లెందులో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో సంజీవ్ నాయక్  ఇల్లెందు నియోజకవర్గం పై గురి పెట్టినట్లేనా..? అనే ప్రచారం జరుగుతుంది..ఈ నేపథ్యంలో ‘విజయం ప్రతినిధి’ అందించే ప్రత్యేక కథనం ఇది.

ఇది కూడా చదవండి: పొద్దుపొద్దుగలే గ్రౌండ్లో మంత్రులు

సంజీవ్ నాయక్ గత మూడేళ్లుగా ఇల్లెందులో వరుస పర్యటన చేపడుతున్నాడు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు.పెళ్లిళ్ళు,ఫంక్షన్ లు,శుభ కార్యాలకు హాజరవుతున్నాడు.ఎక్కడ ఆలయం శంకుస్థాపన జరిగిన విరాళాలు ఇస్తున్నాడు.ఎటువంటి పదవి లేకపోయినా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నాడు.నూతన ట్రెండుకు సంజీవ్ నాయక్ శ్రీకారం చుట్టాడు.వారానికి మూడు రోజులు ఇల్లెందులోని తిష్ట వేస్తున్నా డు. రాబోయే రోజుల్లో నియోజవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు శ్రీకారం చుడుతున్నాడు.రెండు మూడు నెలల్లో కీలక నిర్ణయం తీసుకుంటాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

** ఇంతకీ ఎటు వైపు….

సంజీవ్ నాయక్ ఏ పార్టీ నుండి బరిలోకి దిగుతాడని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇన్ని సామాజిక కార్యక్రమాలు, మానవీయ కార్యక్రమాలు చేపట్టడంతో అందరిలో ఆసక్తిని రేపుతుంది. గ్రామాల్లో వరుసగా పర్యటన చేపడుతున్న సంజీవ్ నాయక్ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతాడని అందరిలో ఆసక్తి నెలకొంది.అన్ని పార్టీల నాయకులలో ఇదే ఉత్కంఠ.ఏది ఏమైనప్పటికీ సంజీవ్ నాయక్ ఇల్లెందు నియోజకవర్గంలోని పోటీ చేయడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏ పార్టీ అనేది త్వరలోనే ఆయనే స్వయంగా ప్రకటిస్తాడని చెబుతున్నారు. ఈ పరిణామంతో ఇల్లెందులో  ఉత్కంఠ భరిత రాజకీయ కోణం వెలుగు చూస్తుంది.

== కేటీఆర్ తో సంజీవ్ నాయక్ కు సన్నిహిత సంబంధాలు..

ఉద్యమ సమయం నుంచి ఆయనకి కేటీఆర్ తో ప్రత్యేక అనుబంధం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఇల్లందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇల్లెందు పైనే ఎందుకు దృష్టి సారించాల్సి వచ్చిందని  సంజీవ్ నాయక్ ను పలువురు అడగ్గా అయన ఈ విధంగా స్పందించారు.వెనకబడిన ప్రాంతం అభివృద్ధి చేసేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోవాలి : హరీశ్ రావు

రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని వెల్లడించాడు. ప్రజల్లో ఉండేందుకు అన్ని విధాలుగా సమాయత్తమవుతునాన్నని ప్రకటించాడు. ఏది ఏమైనప్పటికీ ఇల్లెందు నియోజకవర్గంలో ఉత్కంఠ భరిత రాజకీయ సందడి నెలకొంది. ఏ పార్టీ వైపు ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తి నెలకొంది.ఈ ఉత్కంఠకు తెరపడడలంటె మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

== ఇటీవల ర్యాలీ భారీ సక్సెస్.

సంజీవ్ నాయక్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ పెంచడంపై భారీ ర్యాలీ నిర్వహించారు.ఇల్లందు పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి లలితాపురం వరకు భారీగా మోటార్ సైకిల్ ర్యాలి తీశారు. సంజీవ్ నాయక్ పాదయాత్ర చేస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు నడిచాడు.ఈ అంశం రాజకీయంగా మరింత వేడిని పెంచింది.రాబోయే రోజుల్లో ఏ పార్టీ నుండి ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.ఏది ఏమైనాప్పటికీ కీలక పరిణామాలు జరిగే అవకాశాలు లేకపోలేదు.

 

== ఆయన వెంటే పయనం

గత రెండేళ్లుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంట సంజీవ్ నాయక్ పయనిస్తున్నారు. పెద్దల ఆశీస్సులు తుమ్మలకు ఉండడంతో సంజీవ్ నాయక్ తుమ్మలను ఫాలో అవుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ దఫా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం తుమ్మలకు చెప్పినట్లు సమాచారం తుమ్మల అంగీకారం తెలిపినట్టు సంజీవ్ నాయక్ వర్గీయులలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మలకు విశేష ప్రజాదరణ ఉన్న విషయం తెలిసింది. ఈ దఫా జరిగే ఎన్నికలలో సంజీవ్ నాయక్ పోటీ చేసినట్లయితే తుమ్మల వర్గీలంతా సంజీవ్ నాయక్ మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: 18న సీఎం చేతుల మీదుగా కంటి వెలుగు ప్రారంభం: మంత్రి హారీష్ రావు

వ్యక్తిగతంగా సంజీవ్ నాయక్ ప్రజల్లో ఉన్న క్రేజీకి తుమ్మల వర్గీయులు తోడైతే విజయం సంజీవ్ విజయం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ వచ్చే ఎన్నికలు రసవంతంగా సాగనున్నాయి. ఈసారి ఇల్లందులో ఎవరు పాగా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇల్లందు రాజకీయాలు బొగ్గుల మండుతున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఆ వేడి ఇంకా పెరుగుతుంది రసవతరంగా రాజకీయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.