టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు
-చింత నిప్పు కృష్ణ చైతన్య TRS యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు.
(విజయం న్యూస్):-
టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు రానుందని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగ ప్రకటన హర్షణీయమని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ షేక్ బాజీ బాబా ఆధ్వర్యంలో
ఖమ్మం పట్టణంలోని వివిధ కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ చిత్రపటానికి నిరుద్యోగ యువత పూలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
also read :-ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవం ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఒక లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు.మళ్లీ రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన చేయడం జరిగింది.
also read :-సెర్ప్ ఉద్యోగుల ఛలొ హైదరాబాద్ ను అడ్డుకొన్న పోలీసులు
బహుశా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇన్ని వేల ఉద్యోగాలు ప్రకటించడం తొలిసారిగా జరిగిందని,
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉందని మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు అని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనతో కుటిల రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాగా ప్రకటన చేశారని, ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు విద్యార్థులకు అండగా ఉంటుందని నిరూపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత సంబరాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతి రావు సిబ్బంది నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.