Telugu News

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

0

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

== చిన్నారిని నాయనమ్మ వద్ద వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

చండ్రుగొండ, జనవరి05(విజయం న్యూస్ ):-
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మద్దుకూరు గ్రామానికి చెందిన కుంజా రామక్రిష్ణ, క్రిష్ణవేణి దంపతులకు నాలుగేండ్ల కుమారుడు జర్షల్ (సన్ని), ఏడాదిన్నర శాన్వి కుమార్తె కలదు. రామక్రిష్ణ చర్చి పాస్టర్ కాగ, భార్య క్రిష్ణవేణి ఇంటి వద్ద సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు ట్యూషన్ చెబుతుంటుంది . గురువారం మధ్యాహ్నం అన్నపురెడ్డిపల్లి మండలం భీమునిగూడెం గ్రామంలో జరిగే శుభకార్యానికి భార్యభర్తలు కలిసి వెళ్లారు. కుమార్తె శాన్వి( 18 నెలలు)ను నాయనమ్మ లక్ష్మి దగ్గర ఉంచి వెళ్లారు. సుమారు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ట్యూషన్ కు వచ్చిన పిల్లలతో కలిసి కుంజా శాన్వి ఆటడుతుండగా, నాయనమ్మ ఇంట్లో పనిలో నిమగ్నమైంది. కొంత సమయం గడిసిన తరువాత చిన్నారి శాన్వి కనపడకపోవడంతో తోటి పిల్లలను అడగ్గా ఇక్కడే ఆడుకుందని చెప్పగా, ఎంత వెతికిన కనపడకపోవడంతో, అప్పుడే ఇంటికి చేరుకున్న తల్లి దండ్రులు రామక్రిష్ణ. క్రిష్ణవేణిలు శాన్వి కనపడకపోయిన విషయాన్ని తెలుసుకొని ఆందోళన పడ్డారు. ఈ క్రమంలో పక్క ఇంటిలోని నీటి తొట్టిలో పడి ఉన్న విషయాన్ని గమనించి, హుటహుటిన కొత్తగూడెం తరలించగా, అప్పటికే చిన్నారి చనిపోయిన విషయాన్ని వైద్యులు దృవీకరించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.