Telugu News

దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలి: నరేందర్

బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి

0

దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలి: నరేందర్

== బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి

==  ప్రధాని మోడీ దొంగ బిసి

== విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్

ఖమ్మం, మే8(విజయంన్యూస్):

దేశవ్యాప్తంగా అన్ని కులాల సమగ్ర కుల గణన నిర్వహించాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఇది కూడా చదవండి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న బీసీ (ఓబీసీ) కులాలను లెక్కింపు చేపట్టకపోవడం కాంగ్రెస్, బీజెపీ పార్టీలకు బీసీలపై ఉన్న వివక్షతయే కారణమని, బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో  సంవత్సరాల నుంచి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని,ఓబీసీలు దేశ జనాభాలో 52% ఉన్నారని, జనాభా లెక్కలు చేసే వరకు బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. పేరుకు ఓబీసీలకు కేంద్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని చెబుతున్నప్పటికీ, నిజానికి కేంద్రలో అమలు అవుతున్న రిజరేవషన్లు సగటున 14% అని నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

ఇది కూడా చదవండి : పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

ప్రధానమంత్రి మోడీ బీసీ కాదని, అతను ఒక దొంగ బీసీ అని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం  చేస్తుందని, రానున్న ఎన్నికలలో బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్, యువజన నాయకులు బత్తుల వీరబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు  వినయ్ బాబు, బిక్షపతి గౌడ్, ఆంజనేయ యాదవ్, గణేష్ బాబు, నరేష్, రవీందర్, జంపాల మల్లుసూరు, మహేష్, వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, నరసింహారావు, పాల్గొన్నారు.