Telugu News

అకాల వర్షాలకి నష్టపోయిన ఇల్లును పరిశీలిస్తున్న కాంగ్రెస్ బృందం.

మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆదుకుంటామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు*

0

అకాల వర్షాలకి నష్టపోయిన ఇల్లును పరిశీలిస్తున్న కాంగ్రెస్ బృందం.

*మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆదుకుంటామని హామీనిచ్చిన కాంగ్రెస్ నేతలు*
(కూసుమంచి-విజయం న్యూస్):
మంగళవారం అకాలంగా కురిసిన భారీ వర్షాలకు గాలి వానలకు కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో రేకుల ఇండ్లు పైకప్పులు లేచిపోయాయి. దీంతో ప్రజలు నష్టపోయారు. ఈ విషయం తెలుసుకున్న కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగబండతండా గ్రామంలో పలు బాధిత కుటుంబాలకు చెందిన ఇండ్లను పరిశీలించారు. కాంగ్రెస్ యువ నాయకుడు వడ్తియా సైదులు నాయక్ ఇంటి పై రేకులు లేచి పోవడం వల్ల ఇంట్లో ఉన్న ధాన్యం, వస్తువులన్నీ తడిసిపోయాయి. వాటిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు, సైదులు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకుడు వడ్తియా సుందర్ నాయక్ సతీమణి ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి రాగా ఆమెను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, కూసుమంచి పొంగులేటి గారి ఆఫీస్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా నాయకులు ఎండీ.హాఫీజుద్దిన్, మండల పార్టీ అధ్యక్షుడు మట్టే గురవయ్య, మండల నాయకులు పెండ్ర అంజయ్య, జూకూరి గోపాలరావు, కూసుమంచి మండల కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చీమలదారిగోపి గౌడ్, వెంకటేష్, వడ్తియా సుందర్, బానోతు రమేష్ నాయక్, మాజీ సోసైటీ చైర్మన్ వెంకన్న, బొంగా నాయక్, బిక్ష్మంనాయక్ తదితరులు పాల్గొన్నారు.