Telugu News

తుమ్మల కోసం కదిళన జనం

= శ్రీసిటి వైపు తరలిన వేలాధి మంది కార్యకర్తలు, నాయకులు

0

తుమ్మల కోసం కదిళన జనం

== శ్రీసిటిలోని తన నివాసంలో ఆత్మీయ సమ్మెళనం

== శ్రీసిటి వైపు తరలిన వేలాధి మంది కార్యకర్తలు, నాయకులు

==  దేవాలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి

(ఖమ్మంప్రతినిధి/ఖమ్మంరూరల్-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గానికి స్విప్ట్ అయ్యారు. ఇంతకు ముందు ఖమ్మం నగరంలో క్యాంఫ్ కార్యాలయం ఉండగా, దమ్మపేటలోని నివాసంలో ఉండే వారు. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో పార్టీ కార్యకర్తలు, ఆయన వర్గీయులు ఒత్తిడి మేరకు పాలేరు నియోజకవర్గంలో ఉండాలని నిర్ణయించిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటిలో స్వంతంగా ఇంటిని నిర్మాణం చేశారు. ఆ ఇళ్లు నిర్మాణంలో ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరు, అభిమానులు అందరితో కలిసి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి లక్షలాధి మంది జనం తరలిరావడం శ్రీసిటి అవరణం జనంతో కలకలలాడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా జనం తరలిరావడంతో ఖమ్మం-వరంగల్ ప్రధాన రహధారి ట్రాఫిక్ జామ్ అయ్యింది.

== ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి

నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలోని ప్రసిద్ది గాంచిన దేవాలయాలను సందర్శించారు. ఖమ్మం నగరంలోని స్థంబాద్రి శ్రీలక్ష్మినర్సింహాస్వామి దేవాలయాన్ని సందర్శించుకోగా, వెంకటేశ్వరస్వామి దేవాలయం, కనకదుర్గమ్మ ఆలయం, శివాలయంలోపూజలు చేశారు. అలాగే శ్రీసిటిలో ఉన్న రామయంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన పూజలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

== ఆత్మీయ సమ్మెళనం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్నిమాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుకు అక్కడికివచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజలందరు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు అభివాదం చేశారు. గిరిజన మహిళలు డ్యాన్స్ లు చేస్తుండటంతో వారి వద్దకు వెళ్లి వారితో కాలుకదిపే ప్రయత్నం చేశారు. అనంతరం పార్టీ నాయకులు తీసుకొచ్చిన భారీ కేక్ ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఈ ఆత్మయ సమ్మెళన కార్యక్రానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో సుమారు 4.30 గంటల పాటు విరామం లేకుండా తుమ్మల నాగశ్వరరావు స్టేజీపై నిలబడి వచ్చే ప్రతి ఒక్కర్ని రీసివ్ చేసుకంటూ వారందరికి స్వీట్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.