Telugu News

టిఎల్ పేటలో ఘనంగా బోనాలతో ఊరేగింపు

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

0

టిఎల్ పేటలో ఘనంగా బోనాలతో ఊరేగింపు

== గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

ఏన్కూరు జూన్ 2(విజయం న్యూస్):

(రిపోర్టర్ -చారి)
మండల పరిధిలోని టిఎల్ పేట గ్రామంలో ఆదివారం యాదవుల ఆధ్వర్యంలో మైసమ్మ తల్లికి,గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.తొలుత గ్రామదేవతలకు అభిషేకాలు నిర్వహించారు.భారీ సంఖ్యలో యాదవులు,చిన్నారులు,మహిళలు బోనాలను ఎత్తుకొని మేళతాళాలతో యువకుల నృత్యాలతో మైసమ్మ తల్లి,గంగమ్మ తల్లి దగ్గరకి ఊరేగింపుగా వచ్చారు.అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా కురవాలని,పంటలు బాగా పండాలని,పశు సంపద వృద్ధి చెందాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.