Telugu News

ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..: మంత్రి పువ్వాడ

మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన సరికొత్త పథకం.

0

ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..: మంత్రి పువ్వాడ

▪️మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన సరికొత్త పథకం.

▪️ఆరోగ్య మహిళలో ప్రతి మంగళవారం 57 రకాల ఉచిత పరీక్షలు.

▪️జిల్లా ఆసుపత్రిలో 65 పడకల ప్రత్యేక మహిళా వార్డు, రేడియాలజీ హబ్‌.

▪️ప్రారంబించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

(ఖమ్మంపత్రినిధి-విజయంన్యూస్)

అరోగ్య మహిళ పథకం మహిళలకు వరంలాంటిదని, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మరో గొప్ప వరాన్ని అందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే మంచి కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మహిళలa ఆరోగ్యంకై మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ యూనిట్‌, Mammogram ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇస్తారన్నారు. అవసరమైతే ఇతర దవాఖానలకు రెఫర్‌ చేస్తారన్నారు.

ఇదికూడా చదవండి : ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావడమే మా లక్ష్యం: పువ్వాడ 

పరీక్షల అనంతరం ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలు నమోదు చేసి ప్రతి పేషంట్‌కు తన ఆరోగ్య పరిస్థితి, వైద్యం వివరాలతో కూడిన కేస్‌ షీట్‌ అందజేసి పరీక్షలు పూర్తయ్యాక మెరుగైన వైద్యసేవలు అవసరమని భావిస్తే ఇతర దవాఖానలకు రిఫర్‌ చేస్ అవకాశం ఉందన్నారు. అక్కడ వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తారన్నారు. మెరుగైన సేవలతో విశేష ఆదరణ ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయని, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతున్నదన్నారు. అనతికాలంలోనే రోగుల సంఖ్య రెట్టింపయిందని, ఈ క్రమంలోనే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. DM &HO మాలతి మాట్లాడుతూ.. అరోగ్య మహిళలో వీటిలో 57 రకాల పరీక్షలు ఉచితం మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆయా రుగ్మతలను గుర్తించేందుకు ప్రతి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుందని, దీని కోసమే ‘ఆరోగ్య మహిళ’అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

ఇదికూడా చదవండి: పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ

ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు, అవసరమైన వారికి చికిత్స కూడా చేయనున్నామని, ప్రధానంగా డయాగ్నోస్టిక్స్‌, సూక్ష్మపోషక లోపాలు, పీసీవోఎస్‌, కుటుంబనియంత్రణ, రుతు సమస్యలు, లైంగిక వ్యాధులు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మెనోపాజ్‌ నిర్వహణ, శరీర బరువుకు సంబంధించిన పరీక్షలు చేసి 24 గంటల్లోనే రిపోర్ట్‌లు అందిస్తారన్నారు.మహిళలకు షుగర్‌, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఇంకా వెయిట్‌ మేనేజ్‌మెంట్‌, సెక్స్‌వల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ మే నేజ్‌మెంట్‌, ఇన్‌ఫర్టిలిటీ మేనేజ్‌మెంట్‌, మోనోపాజ్‌, థైరా యిడ్‌, విటమిన్‌డీ-3, ఈ-12 డెఫిసియన్సి వంటి వాటికి దవాఖానల్లో స్క్రీనింగ్‌ చేస్తారన్నారు. దాంతో పాటు యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌, పెల్విక్‌ ఇన్‌ప్లమేటరీ వ్యాధులకు కూడా పరీక్షలు చేయనున్నారని, అసవరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారని, హర్మోన్‌ రీప్లేస్‌మెంట్‌, థెరపీ మెడికేషన్‌, కౌన్సెలింగ్‌ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగ, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై మంత్రి ఏం చేశారంటే..?