Telugu News

డీసీపీ ఎన్. అశోక్ కుమార్ డీసీపీకి ఘనమైన ఆత్మీయ వీడ్కోలు.

రామగుండ-విజయంన్యూస్

0

డీసీపీ ఎన్. అశోక్ కుమార్ డీసీపీకి ఘనమైన ఆత్మీయ వీడ్కోలు.
(రామగుండ-విజయంన్యూస్) :- 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 సంవత్సరాల 4 నెలల పాటు విధులు నిర్వహించి బదిలీ పై చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ కి బదిలీ వెళ్తున్న డీసీపీ ఎన్. ఆశోక్ కుమార్ కు తోటి పోలీస్ శాఖ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికింది.
పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో లోటస్ కాలేజీ ఆవరణలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేయడం జరిగింది. గజమాల, శాలువా తో సత్కరించారు. ఈ సందర్బంగా సీపీ ఇతర అధికారులు మాట్లాడుతూ డీసీపీ ఎన్. అశోక్ కుమార్ సివిల్ అధికారుల సమన్వయంతో క్రైమ్ విషయాలు, వర్టికల్ ట్రైనింగ్స్ , సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి రామగుండం కమిషనరేట్ అడ్మినిస్ట్రేవ్ విషయంలో ముందుండేలాగా కృషి చేశారని కొనియాడారు.

సీపీఓ సిబ్బంది సమన్వయo తో సిబ్బంది సర్వీస్ సమస్యలు క్లియర్ చేస్తూ సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని, అలాగే కింది స్థాయి సిబ్బందికి అన్ని వేళలా అండగా నిలిచారని, ఏ విషయంలో ఐనా తుచా తప్పకుండ, ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా క్రమశిక్షణ, నిబద్దత తో విధులు నిర్వహిస్తారని, గతం లో పనిచేసిన ప్రాంతాలలో, రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మంచి అధికారిగా పేరు తెచ్చుకొన్నారని, అదేవిదంగా తరువాత పోస్టింగ్ లో అధికారులకు, పోలీస్ శాఖ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవిధంగా పనిచేయాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా సుఖసంతోషాలతో గడపాలని అన్నారు.

ఈ సందర్బంగా డీసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ…3 సంవత్సరాల 4 నెలల పాటు అడ్మిన్ గా పనిచేసిన అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది అని రామగుండం కమీషనరేట్ లో నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని, క్రింది స్థాయి పోలీస్ అధికారులు, సీపీఓ అధికారులు,సిబ్బంది సహకారం మరువలేనిది అని, తాను ఎక్కడ పనిచేసినా విధి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే సిబ్బంది పట్ల మర్యాదపూర్వకంగా కొనసాగుతానన్నారు. తనతో కలిసి విధులు నిర్వహించిన, సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంత మంచిగా పనిచేయడానికి అధికారుల నుండి మన్ననలు పొందడనికి సహకరించిన పోలీస్ అధికారులు, ఏఆర్ అధికారులు, సీపీఓ అధికారులు, సిబ్బంది అందరికీ పేరు పేరునా డీసీపీ అడ్మిన్ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ,గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్,, జైపూర్ ఏసీపీ నరేందర్,బెల్లంపల్లి ఏసీపీ మహేష్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, మల్లికార్జున్, ఇన్స్పెక్టర్ లు కమలాకర్,సిహెచ్ వెంకటేశ్వర్లు, మూత్తి లింగయ్య, ప్రతాప్, ప్రవీణ్ కుమార్,నరేందర్,విద్యాసాగర్, ప్రసాద్ రావు, నాగరాజు,కరుణాకర్,లు ఆర్ ఐ లు మధుకర్,అంజన్న, శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఏవో నాగమణి, సెక్షన్ సూపరిండెంట్స్,ఆర్ ఎస్ఐ లు,రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం మరియు ఆర్ఎస్ఐ లు,సీపీఓ, సీసీఆర్బీ సిబ్బంది పాల్గొన్నారు.

also read :- దేశానికి సేవ చేయడం నా అదృష్టం.