Telugu News

ఖమ్మం బీఆర్ఎస్ లో భారీ కుదుపు

గులాబీకి గుడ్ బై చెప్పిన బాలసాని

0

ఖమ్మం బీఆర్ఎస్ లో భారీ కుదుపు

== గులాబీకి గుడ్ బై చెప్పిన బాలసాని

== బాలసానిని కలిసిన తుమ్మల,పొంగులేటి..కార్పోరేటర్లతో భేటి

== అదే బాటలో ఖమ్మం కార్పోరేటర్లు కమర్తపు,నారాయణ, మరికొంతమంది

== రెేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక 

==రాజీనామా దిశగా మరికొంత మంది ముఖ్యనాయకులు

నిలువెత్తు సముద్రం ఉప్పెన వచ్చే ముందు నిశబ్ధం పాటిస్తుందని అన్నట్లుగా ఇప్పటి వరకు నిశబ్ధంగా ఉన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక్క సారిగా ఉప్పెన వలే ఎగిసిపడింది..

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

బీఆర్ఎస్ పార్టీని దడదడలాడించింది.. ఎవరు ఊహించని విధంగా అపరేషన్ అకర్ష్ కు తెరలేపింది.. బీఆర్ఎస్ గూటిలోని ప్రధాన నేతలకు గ్యాలమేసిన కాంగ్రెస్ అగ్రనేతలు.. వారిని కాంగ్రెస్ బాటకు పయనమైయ్యే విధంగా చేస్తూ ఆ పార్టీ నేతలను ఉలిక్కిపడే విధంగా చేసింది.. ఇద్దరు అగ్రనేతలు తలుసుకుంటే ఎలా ఉంటుందో మచ్చుకు చూపించినట్లైంది..  అసలేం జరిగిందంటే..?

 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు.. ఎవరు ఊహించని షాక్ తగిలింది.. ఎన్నికలు గడువు సమీపిస్తున్న తరుణంలో హోరాహోరీగా సాగుతున్న పోరులో దూకుడు పెంచి ఎదురులేదని చెప్పుకుంటున్న బీఆర్ఎస్  పార్టీకి కాంగ్రెస్ పార్టీ సంకెళ్లేపనిలో పడింది.. ఆ పార్టీ కీలక నేతలపై గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీ అపరేషన్ అకర్ష్ కు తెరలేపింది.. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను లాక్కునే పనిలో పడిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు.. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ, ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి ఖమ్మంలో అపరేషన్ అకర్ష్ కు తెరలేపడంతో బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు..

ఇది కూడా చదవండి:- తుమ్మల అక్కడ నుంచే పోటీ

ఆ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగే కార్పోరేటర్లు కమర్తపు మురళీ, చావా నారాయణ, రావూరి సైదాబాబులతో పాటు మరికొంత మంది కార్పోరేటర్లు  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే గంథ్రాలయ మాజీ చైర్మన్ పార్టీని వీడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఖమ్మం నియోజకవర్గంలో అత్యంత కీలక నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మొదటి అభ్యర్థి, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ జేసీ క్రిష్ణ కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందర్ని తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రహస్యంగా కలిసినట్లు సమాచారం. ఇప్పటికే బాలసాని లక్ష్మినారాయణ, కార్పోరేటర్లు మురళీ, నారాయణ, సైదాబాబులను కలిసిన తుమ్మల, పొంగులేటి వారితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు వచ్చి విలేకర్ల సమావేశం నిర్వహించి మరీ బీఆర్ఎస్ నేతపై విరుచకపడ్డారు. అనంతరం హైదరాబాద్ లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  దీంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది..

ఇది కూడా చదవండి:-;కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన డ్యామేజ్ చేసిన కాంగ్రెస్ నేతలు మరోసారి తమ ప్రతాపాన్ని చూపించారు. మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి బదులిస్తామని, కచ్చితంగా రిటన్ గిప్ట్ ఇస్తామని సవాల్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది..

== బాలసాని రాజీనామా..

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశానో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఇటీవలే చెప్పానని రాజీనామా లేఖలో ప్రకటించారు.

ఇది కూడా చదవండి:- పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెల్చి చెప్పారు. ఇదిలా ఉంటే బాలసానిని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి బుజ్జగించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గాయత్రి రవి పోన్లో బాలసానితో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ ను కల్పించి అని విషయాలపై చర్చిస్తామని హామినిచ్చారు. అయినప్పటికి తను నిర్ణయం తీసుకున్నానని, తీసుకున్న నిర్ణయానికి వెనక్కు వచ్చేది లేదని బాలసాని వారి రిక్వస్ట్ ను రిజక్ట్ చేశారు.

== బాలసాని ఇంటికి తుమ్మల, పొంగులేటి

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ ఇంటికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేరుగా వెళ్లి కలిశారు. ఢిల్లీలో ఉన్న ఆ ఇద్దరు నేతలు నేరుగా ప్రత్యేక విమానంలో వచ్చి ఎవరు ఊహించకుండానే తమ ఇంటికి చేరుకుని బాలసానితో చర్చించారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, కచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని తెల్చి చెప్పారు. దీంతో బాలసాని పార్టీలో చేరేందుకు అంగీకరించారు.

== బీఆర్ఎస్ కార్పోరేటర్లతో భేటి

ఖమ్మం కార్పోరేటర్లు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు అత్యంత సన్నిహితులు కమర్తపు మురళీ, చావా నారాయణరావు, సైదారావులతో పాటు మరో కొంత మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, కీలక నాయకులు భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామినిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మక్కువ చూపిన ఆ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అలాగే ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ లను కూడా తుమ్మల, పొంగులేటి భేటి అయినట్లుగా తెలుస్తోంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు సమాచారం. వీరందరు ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సోమవారం వీరందరు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.