Telugu News

కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ ఖాళీ

చేరికలతో మరింత బలం పెంచుకుంటున్న కాంగ్రెస్.

0

కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ ఖాళీ

== చేరికలతో మరింత బలం పెంచుకుంటున్న కాంగ్రెస్.

== చేరికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సోదరుడు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి.

== నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీయే లక్ష్యంగా దూసుకెళ్తున్న పొంగులేటి* ..

== ఎస్సీ, ఎస్టీ నాయకుల చేరిక.. ఆ వర్గాలపై ఎన్నికల ప్రభావం చూపే అవకాశం

(కూసుమంచి -విజయంన్యూస్)

కూసుమంచి మండలం బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.  రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు లో  భారీ మెజారిటీతో గెలిచిన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు జరుగుతుండగా ప్రస్తుతం కూసుమంచి మండలం ప్రజాప్రతినిధుల చేరికతో బీఆర్ఎస్ కారు ఖాళీ అయితున్నట్లే కనిపిస్తుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ ను తిట్టినా నాయకులు ఇప్పుడు అదే పార్టీలో చేరుతుండటంతో

రాజకీయాల్లో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రులు ఉండరు..అన్నట్లుగా అధికార పార్టీ వైపు నాయకులు క్యూ కట్టారు.

 

పార్టీ ఎప్పుడు బలంగా మారుతుందో తెలియదు.. ప్రజానాడిని తెలుసుకున్న నాయకులు ఎప్పుడు రాజకీయాల్లో రాణిస్తారు అనేది అక్షర సత్యం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లుగా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు భూస్థాపితం అయ్యే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి . అందుకే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మరు క్షణం నుండే మాజీ మంత్రులు ,ఎంఎల్ఏ లు , నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి అధికార పార్టీ కాంగ్రెస్లోకి వలసలు కడుతున్నారు. అందుకు మినహాయింపు కాదు నియోజకవర్గాల్లోని జిల్లా , మండల ,గ్రామ స్థాయి నాయకులు కూడా వారి బాటలోనే పయనిస్తున్నారు_ .

_తాజాగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం అయిన పాలేరులో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. గురువారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీలు ఎంపీపీ ,వైస్ ఎంపీపీ ,ఎంపీటీసీలు , సర్పంచులు, మండల పార్టీ నాయకులు మూకుమ్మడిగా బీ ఆర్ ఎస్ కి రాజీనామా చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ మారిన నాయకులు ఎక్కువగా ఎస్సీ , ఎస్టీ నాయకులు కావడం విశేషం ..పాలేరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ , ఎస్టీ ఓటరులు గెలుపు , ఓటములను శాసించగలరు .. వీరి చేరికలతో దాదాపు బీఆర్ఎస్ కూసుమంచి మండలంలో ఖాళీ అయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కన్నా తన నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ తీసుకురావాలనే పట్టుదల కనిపిస్తుంది. అందుకే సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది.. ఈ చేరికతో మండలంలో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడింది._