Telugu News

కూసుమంచి లో బీఆర్ఎస్ కు భారీ షాక్

కాంగ్రెస్ గూటికి కూసుమంచి ఎంపీపీ

0

కూసుమంచి లో బీఆర్ఎస్ కు భారీ షాక్

== కాంగ్రెస్ గూటికి కూసుమంచి ఎంపీపీ

==  వైస్ ఎంపీపీ సహా పలువురు సర్పంచ్ లు, పలువురు నాయకులు

(కూసుమంచి-విజయం న్యూస్):

కూసుమంచి మండలంలో బీ ఆర్ ఎస్ కు పెద్ద్ షాక్ తగిలింది. ఆ పార్టీ నియంత పోకడలు నచ్చట్లేదు అని కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఎం పీ పీ బానోత్ శ్రీనివాస్ నాయక్ కు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆహ్వానించారు. గురువారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ పార్టీ కార్యాలయం లో ప్రసాద్ రెడ్డి సమక్షంలో వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ తో పాటు పలువురు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ లో చేరారు. బీ ఆర్ ఎస్ విధానాలు, పై నాయకుల పోకడలు నచ్చక తాము బయటకు వచ్చినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..శ్రీనన్న ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాo రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకుంటాని కొత్తగా పార్టీ లో చేరిన నాయకులు అన్నారు.
*బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు చేరారంటే..:*

కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, ఎంపీటీసీలు మంగ్యా, మాజీ సర్పంచ్ లు శ్యామ్ సుందర్ రెడ్డి, దరావత్ వెంకట్, బానోతు నాగేశ్వరరావు, బానోతు మమత ఉపేందర్, బాదావత్ బీబ్లీ, ఆమె కుమారుడు రవి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు చాట్ల పరుశురాం కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా

రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బానోత్ రామ్ కుమార్, తాజా, జహంగీర్ షరీఫ్, మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి, నాయకులు బాధవత్ శంకర్, మంగీత్య, శ్రీను, కందిబండ శ్రీధర్, చిలకబత్తిన నాగరాజు, బానోత్ కిషన్ తదితరులు ఉన్నారు.