Telugu News

పార్టీ ద్రోహులకు  గుణపాఠం తప్పదు: నామా

వైరా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు 

0
పార్టీ ద్రోహులకు  గుణపాఠం తప్పదు: నామా
== గులాబీ కండువా మెడలో ఉంటేనే గౌరవం
== దేశానికే అభివృద్ధికి చిహ్నం బీఆర్ఎస్
==వైరా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు 
== మూడోసారి కేసీఆరే మళ్లీ సీఎం ఖాయం:తాతా మదు
(వైరా/ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఉన్నతమైన హోదాల పదవులతో అవకాశాలు కల్పించిన పార్టీకి ద్రోహం చేయాలని చూసినా ద్రోహులకు రానున్న రోజుల్లో ఓట్లతో గుణపాఠం తప్పదని, ప్రజలు కూడా పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాణాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన వైరా పట్టణ, వైరా రూరల్ మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే రాములు నాయక్, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు  మాట్లాడుతూ
ఎవరెన్ని చెప్పినా రానున్న ఎన్నికల్లో మూడో సారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
ఇదికూడా చదవండి: “మట్టా” పయనమెటో….?
90 శాతం పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఇది చరిత్ర, రికార్డ్ అన్నారు. ఈనాడు ప్రతి గుమ్మాన్ని ఏదో పధకం చేరే ఉంటుందన్నారు. మిగతావన్నీ పక్కన పెట్టి అంతా సమైక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో అంతా వన్ సైడేనని స్పష్టం చేశారు. అందరం కలిసి మెలసి ముందుకు సాగుదామని నామ పిలుపునిచ్చారు.  బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధుసూదన్  మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ సభ్యుడూ సైనికుల్లా పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ భిక్ష పెట్టి, సంపదిచ్చిన పార్టీని విమర్శిస్తే పుట్టగతులుండవని అన్నారు. గులాబీ జెండా మన మెడలో ఉంటేనే మనకు గౌరవమని అన్నారు. అలా లేని నాడు అటువంటి వారి పరిస్థితి మనందరికీ తెలుసన్నారు. సీఎం కేసీఆర్ దయతో, కార్యకర్తల కష్టంతో పదవులు పొంది , బయటికి వెళ్లి ఏదో మాట్లాడడం సరికాదన్నారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని , జనంలో మంచి గుర్తింపును ఇచ్చిన పార్టీని బయటికి వెళ్లి స్వార్థంతో స్థాయి మరచి విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి వారంతా పార్టీ ద్రోహులేనని మధు ధ్వజమెత్తారు. తల్లిపాలుతాగి ఆ తల్లి రొమ్మునే గుద్దిన మాదిరి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. హేమహేమీలంతా కాల గర్భంలో కలసి పోయారనిఇది చరిత్ర అన్నారు.
ఉడుత ఊపులకు బలమైన, 64 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ భయ పడదని స్పష్టం చేశారు. చరిత్ర, మానవులున్నంత వరకూ బీఆర్ఎస్ పేరు, కేసీఆర్ పేరు చరిత్రలో ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలు, నిద్రలేమి రాత్రులుతో ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నే మనకు గౌరవం అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ మదిలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ఆయనే మన ధైర్యం.. బలమని అన్నారు. నేడు తెలంగాణా ను యావత్ దేశం అనుచరిస్తుందంటే కేసీఆర్ వల్లనేనని చెప్పారు. ప్రపంచంవిస్తు పోయేలా కేసీఆర్ పాలన ఉండడం మన అదృష్టం అన్నారు.90 శాతం ప్రజలు కేసీఆర్ ను పెద్దకొడుకుగా భావిస్తున్నారని, లబ్ది పొందిన ప్రతి కుటుంబం రానున్న ఎన్నికల్లో కేసీఆర్ వెంట నడుస్తుందన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎంతో అకుంఠిత దీక్షతో, నిద్రాహారాలు మాని తెలంగాణా సాధించిన సీఎం కేసీఆర్ పై అవాకులు.. చవాకులు పేలితే సహించేది లేదని, అటువంటి వారిని ప్రజలు ఉరికించి కొట్టే రోజులొస్తాయని, అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ లైన్ తప్పే వారి పట్ల, కోవర్ట్ గిరి చేసే వారి పట్ల, వేరే ఆలోచనలు చేసే వారి పట్ల పార్టీ అధినాయకత్వం కఠినంగా స్పందిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ద్వారా సమాజానికి పరిచయమై, సంపాదించుకున్నవారు పార్టీ పై బురద జల్లుతున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆ వ్యక్తి పేరులో ఉన్న గొప్పతనం ప్రవర్తన లేదన్నారు.
== బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలువురు                               ఇదికూడా చదవండి: ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఘర్షణ
కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సక్కుబాయి, టిడిపి కంటెస్టెడ్ కౌన్సిలర్ ఏనుగు హనుమంతురావు  ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎమ్మెల్యే రాములు నాయక్  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడమైనది. ఈ సమావేశంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ బీడీకే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జెట్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మండల , టౌన్ పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, కట్టా కృష్ణార్జునరావు, పసుపులేటి మోహన్ రావు, షేక్ లాల్ మహ్మద్ వనమా విశ్వసరావు, కౌన్సిలర్లు ,   సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు