ఓ ప్రేమ వివాహం .. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు…
(ఇల్లందు_విజయం న్యూస్):-
అర్థరాత్రి బహిరంగం గానే ఇరు వర్గాల బహాబహి _ దాడిలో కారు ద్వంసం,దగ్ధం _ కోయాగుడెం లో ఘటన …. ఓ ప్రేమ జంట తెచ్చిన తంటా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ కి దారి తీసి దాడికి కారణమైంది. ఈ ఘర్షణలో లో ప్రేమ జంట కు సహకరించి ఉంటాడని అనుమానంతో ఒక వ్యక్తి షిఫ్ట్ డిజైర్ కార్ ను పూర్తిగా ధ్వంసం చేసి దగ్ధం చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం
కోయగూడెం గ్రామంలో లో చోటు చేసుకుంది .కోయగూడెం కు చెందిన యువతి, కిష్టారం పంచాయతీ రోడ్డు గుంపు గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు.
also read ;-రు. 100 పెట్రోల్ కొడితే సగం కూడా రాలేదు
మూడు రోజుల క్రితం ప్రేమ జంట ఇంటి నుండి వెళ్ళి పోయారు. ఈ విషయంపై ప్రేమ జంట ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య గురువారం అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘటన లో వారి ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని అనుమానితుడు గా భావించి, అతడు వేసుకొచ్చిన షిఫ్ట్ డిజైర్ కారును పూర్తిగా ధ్వంసం చేయడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి మూడు గంటల ప్రాంతంలో లో ధ్వంసమైన కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ విషయం టేకులపల్లి ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు…..