Telugu News

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య.

గార్ల-విజయం న్యూస్

0

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య.

(గార్ల-విజయం న్యూస్)

. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గార్ల రైల్వే స్టేషన్ శివారులోని డబ్బాల మోరి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం. ఇల్లందు పట్టణం గోవింద్ సెంటర్ కు చెందిన కొవ్వాకుల వెంకటేశ్ (22) ముప్పై ఐదు రోజుల క్రితం తనకు వివాహం జరిగింది. మృతుడు కొవ్వాకుల వెంకటేశ్ తన అల్లుడితో పాటు గార్లకు వచ్చి, అల్లుడికి ఇక్కడి వరకు వెళ్లి వస్తానాని చెప్పి వెళ్లాడు. కుటుంబ కలహలతో మనస్తాపానికి గురై మంగళవారం గార్ల రైల్వే స్టేషన్ శివారులో డబ్బాల మోరి వద్ద కోర్బా ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

దీంతో వెంకటేశ్ తల మొండెం వేరుగా పడిపోయాయి . అల్లుడు చూసి వెంకటేష్ ఫోన్ తోనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి డోర్నకల్ జీఆర్పీ పోలీసులు చేరుకొని, మృతుదేహాన్ని స్వాధీనం చేసుకొని, పంచనామ నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

also read :-మేమింతే….. మారమంతే….?