Telugu News

కూసుమంచి ఎంపీపీకి తప్పిన ప్రమాదం

కారు, మోటర్ సైకిల్ ఢీ

0

కూసుమంచి ఎంపీపీకి తప్పిన ప్రమాదం

== కారు, మోటర్ సైకిల్ ఢీ

(కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండల ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ కు తృటిలో ప్రమాదం తప్పింది.. సీసీ రోడ్డు ప్రారంభానికి ఓ గ్రామానికి వెళ్తున్న కూసుమంచి ఎంపీపీ కారు, మోటర్ సైకిల్ ఢీకొట్టుకోవడంతో కారు, మోటర్ సైకిల్ పూర్తిగా డ్యామేజి అయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన బుధవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలంలోని జుజారావుపేట గ్రామంలో అభివృద్ధి పనులకు  శంకుస్థాపన చేయుటకు వెళుతున్న సందర్భంలో అటువైపు గా వస్తున్న  ద్విచక్ర  వాహనంపై వస్తున్న యువకుడు  బయటకు ఆగి ఉన్న ఎంపీపీ కారును  ఢీకొనడం జరిగింది. కారు ముందు భాగం పూర్తిగా డామేజ్ అయింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీతో ఫోన్లో ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ యువకుడుని క్షమించి వదిలేయడం ఎంపీపీ మంచితనానికి నిదర్శనం.

allso read- పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ