Telugu News

ఖమ్మంలో కదం తొక్కిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు

ఘనంగా ప్రారంభించుకున్న సత్తెనపల్లి రామకృష్ణ భవన్*

0

ఖమ్మంలో కదం తొక్కిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు

*ఘనంగా ప్రారంభించుకున్న సత్తెనపల్లి రామకృష్ణ భవన్*

*వర్గ దోపిడి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు*

*కేరళ మాజీమంత్రి శైలజ టీచర్*

*ప్రజా సమస్యల పరిష్కారాలకు వేదికలుగా కమ్యూనిస్టు కార్యాలయాలు*

*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం*
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం: సిపిఎం ఖానాపురం హవేలీ కమిటీ కార్యాలయం (సత్తెనపల్లి రామకృష్ణ భవన్) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రారంభోత్సవానికి ముందుగా స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం నుండి కార్యాలయం వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు సుమారు 2000 మందితో వివిధ అలంకార రూపాలతో భారీ ప్రదర్శనతో రామకృష్ణ భవన్ వరకు చేరుకోవడం జరిగింది పార్టీ కార్యాలయాన్ని శైలజ టీచర్ తమ్మినేని వీరభద్రం లు ప్రారంభించారు ప్రారంభ సూచిక జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి మున్నా నాగేశ్వరరావు ఆవిష్కరించారు
అనంతరం సిపిఎం అవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సభా కార్యక్రమంలో శైలజ టీచర్ మాట్లాడుతూ దోపిడీ ఉన్నంతకాలం అసమానతలు ఉన్నంతకాలం ఆకలి సమస్యలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని కమ్యూనిస్టులు ఉంటారని ఈ అసమానతలకు పరిష్కారం కార్మిక వర్గ రాజ్య స్థాపన అని పేర్కొన్నారుఇందుకోసం దేశంలోనే మొదటిసారిగా ఏర్పడిన కేరళ ప్రభుత్వం అనేక రూపాలలో విద్య వైద్యం గృహ నిర్మాణం శిశు మరణాల రేటు తగ్గింపు వండి అనేక కార్యక్రమాలలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మొట్టమొదటి 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ రాష్ట్రం ఉందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ఈ స్ఫూర్తితో గమనిస్తూ ప్రభుత్వాల ఏర్పాటుకై కృషి చేయాలని పిలుపునిచ్చారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టు కార్యాలయాలు అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు కరోనాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట ప్రజల ముందుకు వచ్చి కరోనా వైద్య కార్యక్రమాలను నిర్వహిం చిన్న పార్టీ సిపిఎం పార్టీ ఈ సేవలకు వేదికలుగా నిలిచిన కార్యాలయాలు సిపిఎం కార్యాలయాలు పేర్కొన్నారు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మతోన్మాద బీజేపీని వెనక్కి కొట్టడం కోసం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం లౌకిక విలువలు కాపాడటం కోసం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం నిక్కచ్చిగా నిలబడి కొట్లాడేది కమ్యూనిస్టులేనని పేర్కొన్నారు సమస్యలు ఉన్నంతవరకు ఎర్రజెండా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బి వెంకట్ ఎం సాయిబాబా పోతునేని సుదర్శన్ నున్న నాగేశ్వరావు పి సోమయ్య ఎర్ర శ్రీకాంత్ పొన్నం వెంకటేశ్వరరావు మాచర్ల భారతి బుగ్గవీటి సరళ కళ్యాణ వెంకటేశ్వరరావు వై విక్రం భూక్య వీరభద్రం బొందు రాంబాబు చింతలచెరువు కోటేశ్వరరావు ఎం సుబ్బారావు సత్తెనపల్లి మంగ పెద్ది నాగయ్య దొంగల కోటయ్య దనేకుల నాగేశ్వరరావు వైవి నారాయణరావు మాదగాని సంగయ్య వాసిరెడ్డి మల్లికార్జునరావు మచ్చ భాస్కర్ ఆర్ ప్రకాష్ తుషాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు