Telugu News

తెలుగు ప్రజలు మర్చిపోలేను వ్యక్తి పీవీ: పువ్వాళ

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పి వి నరసింహారావు వర్దంతి వేడుకలు

0

తెలుగు ప్రజలు మర్చిపోలేను వ్యక్తి పీవీ: పువ్వాళ

** దేశ ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పునకు బీజం వేసిన యోధుడు

** జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పి వి నరసింహారావు వర్దంతి వేడుకలు
** పివి నరసింహారావు వర్ధంతి సభలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్) 

భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి పీవీ నరసింహారావు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కొనియాడారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో శుక్రవారం పీవీ నరసింహారావు 18వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పీవీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఇది కూడా చదవండి: త్వరలో శీనన్న పాదయాత్ర..?

అనంతరం మాట్లాడుతూ….పాములపర్తి వేంకట నరసింహారావు ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడని అన్నారు.ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడని కొనియాడారు.1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడని అన్నారు.1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడని 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడరని అన్నారు. కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీధి ఒక ప్రత్యేక స్థానం అని అన్నారు. నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహ్మద్ జావేద్ మాట్లాడుతూ పి వి నరసింహారావు గారు హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనదని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థలో ఆయన చేసిన సేవలు
ఎనలేనివని అన్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు సిని పరిశ్రమలో విషాదం..కైకాల ఇక సెలవు

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వనం ప్రదీప్త చక్రవర్తి (బాబు), నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు నాయక్, పల్లెబోయిన భారతిచంద్రం,సయ్యద్ హుస్సేన్, గజ్జెల్లి వెంకన్న, పాలకుర్తి నాగేశ్వరరావు, బాలాజీ నాయక్, బండి నాగేశ్వరరావు, యాసబోయిన శ్రీశైలం,అమరనేని బాబూరావు, తలారి నాగభూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.