Telugu News

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య.

తిరుమలాయపాలెం విజయం న్యూస్

0

కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

తిరుమలాయపాలెం విజయం న్యూస్

కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన రామడుగు శేషగిరిరావు(40) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు.

మూడు సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనికి తోడు ఆర్థిక సమస్యలు తోడవడం,ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో శుక్రవారం ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడ్డు.గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం ఆటోలో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.మృతునికి భార్య సౌజన్య,కుమారులు రోహిత్,ధనుష్ ఉన్నారు.శేషగిరిరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురుని కంటతడి పెట్టిస్తున్నాయి.భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

also read ;-ఏపీలో రెడ్ అలార్ట్ ** ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు