Telugu News

ఖమ్మం జిల్లా వాసికి పోలీస్ శాఖలో అరుదైన గౌరవం

==సీఐ శెట్టి శ్రీనివాస్ రావుకు ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించిన కేంద్రం == అభినందించిన మూడు జిల్లాల పోలీసాధికారులు

0

ఖమ్మం జిల్లా వాసికి పోలీస్ శాఖలో అరుదైన గౌరవం
==సీఐ శెట్టి శ్రీనివాస్ రావుకు ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించిన కేంద్రం
== అభినందించిన మూడు జిల్లాల పోలీసాధికారులు

(ఖమ్మం – విజయం న్యూస్) :-
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే పోలీస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందిస్తూ వస్తోన్నది.

ఆదివారం ప్రకటించిన ఈ అవార్డులో ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన శెట్టి శ్రీనివాసరావు కు దక్కింది.

2001లో సివిల్ కానిస్టేబుల్ ఎంపికైన శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో పని చేశారు.

అనంతరం 2009లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యాడు. సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వరంగల్ భూపాలపల్లి జిల్లాలో పని చేశాడు.

అనంతరం పదోన్నతి పై ఇన్స్పెక్టర్గా సూర్యాపేట కు బదిలీ అయ్యాడు ప్రస్తుతం వరంగల్ లో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్ ప్రకటించిన ఉత్తమ సేవా పథకాలకు శ్రీనివాస్ ఆదివారం నాడు ఎంపికయ్యాడు.

పోలీస్ శాఖలో తనకు అరుదైన గౌరవం నాకు దక్కటం పట్ల ఎంతో గర్వంగా ఉందని శ్రీనివాస్ తెలిపాడు.

ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసి జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు.

మేడారం సమ్మక్క సారక్క జాతర లో భక్తులకు అందించిన సేవలకు గాను అప్పట్లో ఉన్నతాధికారుల మన్ననలు పొందాడు.

నాకు ఈ అవార్డు రావడానికి చిన్నప్పటినుండి నాకు అండగా ఉండి నా ఎదుగుదలకు విశేషం కృషి చేసిన తన తల్లిదండ్రులకు శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపాడు.

తనకు రామకృష్ణాపురం ప్రజలు దండలు ఎంతగా ఉన్నాయని వారి ఆశీస్సులతో పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నత శిఖరాలు అనుకుంటారని శ్రీనివాస రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

దీంతో ఆయన పనిచేసిన వరంగల్, సూర్యపేట జిల్లా పోలీసులతో పాటు, ఖమ్మం జిల్లా పోలీసాధికారులు శెట్టి శ్రీనివాస్ రావును అభినందిస్తున్నారు.

also  read :-రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ ఆంక్షలు…

also read :-ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన టీఎన్జీవోస్ కార్యవర్గం