Telugu News

ధాన్యం తరుగు తీస్తున్న రైస్ మిల్ సీజ్

రైతుల నుంచి భారీగా తరుగు తీస్తున్న మిల్ యజమాని

0
ధాన్యం తరుగు తీస్తున్న రైస్ మిల్ సీజ్
== రైతుల నుంచి భారీగా తరుగు తీస్తున్న మిల్ యజమాని
== రైతుల ఫిర్యాదుతో తనిఖీ చేసిన అధికారులు
== ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో రైస్ మిల్ ను సీజ్ కు ఆదేశాలిచ్చిన కలెక్టర్
ఖమ్మం, మే 9(విజయంన్యూస్): 
రైతులను మోసం చేయడంలో మిల్లర్లు ముందుంటున్నారు.. అరుగాలం కష్టపడి చేమటోడ్చి పండించిన పంటను వాతావరణ పరిస్థితుల రిత్యా ధానంను కాపాడుకోలేక, రోజుల తరబడి కేంద్రాల్లో ఉండలేక  వచ్చినకాడికే చాలు అని అనుకుంటున్న రైతన్నలు చేసేదేమి లేక అగ్గువ ధరకే ధాన్యంను విక్రయిస్తున్నారు. రైతుల మంచితనాన్ని అసరాగా చేసుకుంటున్న మిల్లర్లు వారి చెమటను దోపిడి చేస్తున్నారు. ఇటీవలే ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుతో మిల్లర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కుమ్మకవుతున్న మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వం ఒక వైపు తరుగు తీయోద్దు అని చెబుతున్నప్పటికి అధికారులకు, ప్రభుత్వానికి సంబంధం లేకుండా 10 నుంచి 15 కేజీల తరుగు తీస్తూ రైతుల కష్టాన్ని తెగ మింగేస్తున్నారు.   దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయం పై రైతులు అనేక రకాలుగా ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్రాలు అందించడం, ఆందోళన చేయడం జరుగుతోంది. రైతులు రోడ్డేక్కి ఆందోళన చేస్తున్నప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ మాత్రం రైతుల గోసను పట్టించుకునే పనిలో నిమగ్నమైయ్యాడు. రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన కలెక్టర్ రైతులను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మిల్లర్లతో మాట్లాడుతూ తరుగు పేరుతో ఇబ్బంది పెట్టోద్దని మిల్లర్ల యజమానులకు ఆదేశాలిచ్చారు. అయినప్పటికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా రైస్ మిల్లర్ల యజమానులు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు.
ఈ విషయంపై సీరియస్ అయిన జిల్లా  రైతులను మోసం చేస్తున్నట్లు తెలియగానే జిల్లా బాస్ తక్షణమే స్పందించారు..కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు.
== పెనుబల్లిలో రైస్ మిల్ సీజ్ 
జిల్లాలోని పెనుబల్లి మండలం అరిసెల్లపాడు గ్రామంలోని శ్రీలక్ష్మి శ్రీనివాస పారా బాయిల్డ్ రైస్ మిల్లును సీజ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్య సేకరణలో భాగంగా మిల్లుకు కేటాయించిన ధాన్యం తీసుకోకుండా, తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టడం, స్వంతంగా ధాన్యం కొనుగోలు చేసి, అట్టి ధాన్యానికి సంబంధించి రిజిస్టర్లు తనిఖీ అధికారులకు చూపకపోవడం, అధికార యంత్రాంగం సూచనలు పెడచెవిన పెట్టడంతో రైస్ మిల్లును సీజ్ చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో 64 రైస్ మిల్లులు ఉన్నట్లు, జిల్లా వ్యాప్తంగా 232 ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి, సేకరించిన ధాన్యాన్ని కేంద్రాలకు దగ్గరలోని రైస్ మిల్లులకు ట్యాగ్ చేసినట్లు ఆయన తెలిపారు. మిల్లుల ద్వారా ధాన్య సేకరణ సజావుగా జరుగుతున్నట్లు, కొన్ని మిల్లులు తరుగు పేరిట రైతులకు ఇబ్బందులు కల్గిస్తున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ధాన్య సేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని, తరుగు పేరిట, అన్లోడ్ పేరిట రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
== కలెక్టర్ కు అభినందనలు 
తరుగు పేరిట కొరత స్రుష్టిస్తున్న రైస్ మిల్ ను సీజ్ చేసి మిల్లర్లను హెచ్చరించిన కలెక్టర్ వి.పి.గౌతమ్ ను రైతులు, రైతు సంఘాల నాయకులు అభినందిస్తున్నారు. తరుగు పేరుతో ిఇష్టానుసారంగా 10 నుంచి 15 కేజీలు తరుగు తీస్తున్నారని రైతులను మోసం చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. రైతులకు అండగా నిలుస్తున్న జిల్లా కలెక్టర్ ను రైతులు అభినందిస్తున్నారు.