Telugu News

ఖమ్మంలో మంత్రికి షాక్..ఎందుకంటే..?

కాన్వాయ్ ని అడ్డుకున్న నిరుపేద మహిళలు

0

ఖమ్మంలో మంత్రికి షాక్

== కాన్వాయ్ ని అడ్డుకున్న నిరుపేద మహిళలు 

== నిరుపేదలు-పోలీసుల మధ్య తోపులాట

== బీఆర్ఎస్ నేతలు మాపై చేతులేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు

== గంట పాటు ఉద్రిక్తత

== పోలీసుల సహాయంతో బయటకు వెళ్లిన కాన్వాయ్

== మహిళలపై దాడిని ఖండించిన కాంగ్రెస్ నేతలు

== ప్రశ్నిస్తే దాడి చేస్తారా..? అంటూ పొంగులేటి ఆగ్రహం

== విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ నేతలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు షాక్ తగిలింది.. ఖమ్మంను అన్ని రంగాల్లో అభివద్ది చేసి ఒక తిరుగులేదనుకుంటున్న సందర్భంలో కొందరు మహిళలు తన కాన్వాయ్ ను అడ్డుకుని హల్ చల్ చేశారు..

ఇది కూడా చదవండి:- నువ్వేదో పొడుస్తావని నిన్ను  గెలిపించలేదు: పొంగులేటి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు విషయంలో అవకతవకలు జరిగాయని, అర్హులకు అందలేదని బాధితులు, నిరుపేద మహిళలు మంత్రి పువ్వాడ అజయ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు మద్య తోపులాట జరిగింది.. బీఆర్ఎస్ నాయకులు మధ్యలో కల్పించుకోవడంతో మహిళలకు,నిరసన కారులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.. సుమారు గంట పాటు ఉద్రిక్తత వాతావరణం నేలకొంది. ఈ క్రమంలో పోలీసులు కల్పించుకుని నిరసన చేస్తున్న మహిళలను అడ్డు తొలగించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు దారి ఇవ్వగా ఆయన వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్ కాలనీలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగింది.. 

ఇది కూడా చదవండి:- పాలేరు ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట దళితుల ధర్నా

నగరంలోని  8వ డివిజన్ వైఎస్సార్ నగర్ లో రూ. 580.80 లక్షలతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో తీవ్ర అవకతవకలు జరిగాయని కొందరు ఇండ్లు రానీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామినిచ్చి తిరిగి వెళ్లిపోతుండగా బాధిత మహిళలు మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకున్నారు. మహిళలు అడ్డుపడి కదలనివ్వకుండా చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని మహిళలను అడ్డుతప్పించే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. కొంత నచ్చజెప్పే ప్రయత్నం జరుగుతుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళల వద్దకు వచ్చి గట్టిగా బెదిరించే ప్రయత్నం చేయడంతో తోపులాట కాస్త ఘర్షణకు దారితీసింది. మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోపులాడుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్పించుకోవడంతో అక్కడ రచ్చరచ్చగా మారింది.బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. దీంతో తోపులాట, ఘర్షణలో మహిళలు కిందపడిపోయారు. మోటర్ సైకిళ్లు కిందపడిపోయాయి. కొంత మందికి స్వల్పగాయాలైయ్యాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కొంత మంది వచ్చి అడ్డుకున్న మహిళలను, నిరుపేదలను పక్కకు తొలగించి మంత్రిని అక్కడ నుంచి పంపించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ కాలనీలో 5వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేశారని,

ఇది కూడా చదవండి:- లోక్ సభ అభ్యర్థిగా  ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ జెండా పట్టుకుని తిరిగే వారికి మాత్రమే ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించారు. అర్హత కల్గిన ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిరుపేదలకు, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు.

== డివిజన్ కార్పోరేటర్ లేకుండానే ప్రారంభోత్సవం

ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ పరిధి, వైఎస్ఆర్ నగర కాలనీలో నూతనంగా నిర్మాణం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ చిచ్చు రేపింది.  ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కాగా, స్థానిక కార్పోరేటర్  కాంగ్రెస్ పార్టీకి చెందిన లకావత్ సైదులు ను పిలవకుండానే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ముగించారు. అక్కడికి వచ్చిన కార్పోరేటర్ ఇదేంటని ప్రశ్నించగా ఆయన్ను బీఆర్ఎస్ నేతలు నెట్టేశారని కార్పోరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:- పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి

ప్రోటోకాల్ పాటించకపోవడంతో పాటు తప్పులు జరుగుతున్నాయని ప్రశ్నించిన వారిపై మహిళలపై దాడి చేయడం అమానిషమని ఆరోపించారు.

 ===============================================