కన్నీటి పర్వంతమైన సీఎల్పీనేత
== ఐతం పాడే మోసిన భట్టి విక్రమార్క
== అశ్రునయనాలతో ఐతం అంతిమయాత్ర
== అంతిమయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)
స్వాతంత్ర సమరయోధులు, తామర పత్ర గ్రహీత కాంగ్రెస్ నాయకులు, ఐతం వెంకటేశ్వరరావు మృతి పట్ల మధిర శాసనసభ్యులు, శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గురు సమానులైన ఐతం వెంకటేశ్వరరావు హాటాన్మరణం భట్టి విక్రమార్కను కలిసివేసింది. హుటాహుటిన ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో ఉన్న ఐతం వెంకటేశ్వరరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఐతం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తూ దైర్యం చెప్పారు. ఐతం వెంకటేశ్వరరావు తన గురు సమానులని, మొదటి నుంచి తనకు తోడుగా ఉన్నారని జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
allso read- అయితం వెంకటేశ్వర్లుకి నివాళ్ళు అర్పించినా కాంగ్రెస్ నేతలు
ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవను ఎవరు మరవలేరని అన్నారు. నాతో పాటు కుటుంబం ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. ఐతం లేని ఈరోజు నాకు తీరని లోటుగా ఉందని అన్నారు. ఆయన నాకు ఎంతో దైర్యమిచ్చారని, రాజకీయ ఓనమాలు నేర్పారని, గెలుపు, ఓటముల ఫలితం ఎలా ఉంటుందో వివరించేవారని అన్నారు. అనంతరం ఐతం వెంకటేశ్వరరావు అంతిమయాత్రలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంతిమయాత్ర మొత్తం పాడెను మోశారు. అంతిమయాత్ర చివరి వరకు ఉండి అంతమదానసంస్కారాలు చేయించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏ.కే. రామారావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు, పుచ్చకాయల వీరభద్రం, మిక్కిలినేని నరేందర్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.