Telugu News

ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డ మృతి

పసిబిడ్డ ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం 

0

ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డ మృతి

== పసిబిడ్డ ప్రాణాలు తీసిన వైద్యుల నిర్లక్ష్యం 

== 20 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తత, సస్పెన్స్

== బాధితులకు న్యాయం చేయాలని వారి పక్షాన పోరాటం చేసిన బిజెపి నాయకులు*

== నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వ విఫలం: బీపీ నాయక్*

(కొణిజర్ల-విజయం న్యూస్):

పసిబిడ్డ ప్రాణాలు తీసిన ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం పైన మండిపడ్డ బిజెపి నాయకులు, బాధితులకు తక్షణమే న్యాయం జరగాలని మెరుపు నిరసనను తెలియజేశారు.
మండల కేంద్రంలోని రామ నర్సయ్య నగర్ గ్రామవాసి ఆంగోత్ రాజా, శైలజ దంపతులకు వివాహమై ఏడు సంవత్సరాలు పూర్తయినది. సంతానం కోసం వారు ఎక్కని హాస్పిటల్ మెట్టు లేదు మొక్కని గుడి మెట్టు లేదు. వారి పూజల ఫలంగా సంతానం కలగగా, ప్రసూతి కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పసిపాప ప్రాణాలు పోయాయి.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు వారి సహకారంతో 20 గంటల పాటు సంఘటనా స్థలంలోనే ఉండి బాధితులకు న్యాయం చేయాలని మొండిపట్టుగా నిరసన చేసిన రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ *బీపీ నాయక్*, జిల్లా ప్రధాన కార్యదర్శి లు శ్యాంసుందర్, నున్నా రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ శ్రీదేవి, జిల్లా మోర్చా నాయకులు దుద్దుకూరి కార్తీక్, జటోత్ మోహన్, కుమార్. ఇదే విషయం గురించి పూర్తి నిజ నిర్ధారణ చేయాలని లిఖితపూర్వకంగా జిల్లా ఉన్నత వైద్యాధికారికి ఫిర్యాదులు అందజేశారు. అలాగే జిల్లా పోలీస్ కమిషనర్, ఏసిపి మరియు టూ టౌన్ సీఐ లను కలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు వెంటనే తీసుకోవాలని బాధితులను తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని సూచించారు.
బాధితులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ రాజా మరియు శైలజ కుటుంబానికి అండగా ఉంటూ పోరాటం కొనసాగిస్తామని భరోసానిచ్చారు.