Telugu News

బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్

వారెంట్ లేని కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయాలి

0

బీఆర్ఎస్ గెలుపే అభివద్దికి మలుపు: మంత్రి కేటీఆర్

== వారెంట్ లేని కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయాలి

== కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, ప్రశాంత్,పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మంజిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలుపే.. అభివృద్ధికి మలుపు కావాలని,, అందుకే జిల్లా  ప్రజలందరు మీ జిల్లా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి లో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీ కి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మేల్యే రాములు నాయక్, రాజ్యసభ సభ్యులు గాయత్ర రవి, బండి పార్థసారథిరెడ్డి లు శంకుస్థాపన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతు ఫ్యాక్టరీని ఈ ప్రాంత రైతులు సద్వినియొగం చేసుకొని, ఆర్థికంగా పైకి ఎదగాలన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బాలసాని లక్షీనారాయణ, కలెక్టర్ వీ.పీ గౌతమ్, గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు లేనట్లే..?