Telugu News

ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది.

రౌండ్‌ ఆఫ్‌ పేరుతో అదనపు వసూలుపై ఓ ప్రయాణికుడి ట్వీట్‌

0

ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది.

రౌండ్‌ ఆఫ్‌ పేరుతో అదనపు వసూలుపై ఓ ప్రయాణికుడి ట్వీట్‌.

ఇదేమిటని ఆరా తీసిన కొత్త ఎండీ సజ్జనార్‌.

అదనపు వసూలు రద్దుకు ఆదేశం.

లక్షల్లో ఆదాయం తగ్గినా సంస్థ ప్రతిష్ట కోసం నిర్ణయం!

హైదరాబాద్‌: అసలే నష్టాలు.. అప్పులు, కోవిడ్‌ సమస్యతో అతలాకుతలం.. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుకు స్పందించిన ఆర్టీసీ.. రోజూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమైంది. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది. ఇప్పుడు నష్టం ఎదురైనా.. ఆర్టీసీ ప్రతిష్ట మెరుగుపడి భవిష్యత్తులో సంస్థ వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
చిల్లర సమస్య పేరిట..
ఇటీవల ఓ ప్రయాణికుడు బెంగుళూరు బస్సు ఎక్కాడు. టికెట్‌పై వివరాలు చూసి కంగుతిన్నాడు. టికెట్‌ అసలు ధర రూ.841 అని.. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను నిలదీశారు. అసలు ధరను మించి రూ.9 వసూలు చేయడం ఏమిటని, ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నిస్తూ.. ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ఇది ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

also read :-తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత